ఉపాధి పనులకు కొందరినే పిలుస్తున్నారు

కృష్ణా జిల్లా: ‘అన్నా.. టీడీపీ నేతలు అన్నింటా వివక్ష చూపుతున్నారు. కనీసం కరువు పనులు కూడా దక్కనీయడం లేదు. రోజుకు రెండు మూడు వందలు సంపాదించుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. పార్టీ, వర్గం, ప్రాంతాన్ని బట్టి పనికి పిలుస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అభిమాని అని తెలిస్తే చాలు పనులకు పిలవడం లేదు. ఇక్కడ పనుల్లేక నగరాలకు వలస వెళుతున్నాం..’ అని ఉపాధి కూలీలు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డితో వాపోయారు.  టీడీపీ మద్దతుదారులు పనులకు రాకపోయినా, వచ్చినట్టుగా జాబ్‌కార్డుల్లో నమోదు చేసి, వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూ ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారని గోడువెళ్లబోసుకున్నారు. అందరి సమస్యలు విన్న జననేత అందరికీ ధైర్యం చెప్పారు. కొందరికి అక్కడికక్కడే పరిష్కారం చూపారు. మనందరి ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.   

Back to Top