రిక్షా తొక్కి సంపాదించిన డబ్బును గద్దల్లా త‌న్నుకెళ్లారు

గుంటూరు: రిక్షా తొక్కి సంపాదించుకున్న సొమ్మును టీడీపీ నేతలు గద్దల్లా దోచుకుతిన్నారని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట కావూరు కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో గిరిజన మహిళలు జననేతను కలుసుకున్నారు. ఇప్పటి వరకు మాకు అన్యాయం జరగలేదని, మా డబ్బులు అందే విధంగా చూడాలని జననేతకు చెప్పుకున్నారు. చెమట చిందించి సంపాదించిన డబ్బును అగ్రిగోల్డ్‌లో దాచుకుంటే దోచేశారన్నారు. తినకుండా.. ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించామన్నారు. పత్తిపాటి పుల్లారావు మా వాడకు వస్తే కసి తీర్చుకుంటామని, పుల్లారావు వల్ల ఏం సాయం అందలేదన్నారు. డబ్బులు తిన్నవారు ఎవరూ బాగుపడరని గిరిజన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మ్రరి రాజశేఖర్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదవారికి 52 ఎకరాల భూమి ఇచ్చారని, ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు ఆ స్థలంలో అపార్ట్‌మెంట్‌లు కట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నాడన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top