తండ్రీకొడుకుల వెంట పాదయాత్రలో..

 ఆయన వయస్సు ఏడు పదుల పైమాటే. అయినా ఆయనలో ఏమాత్రం అలసట లేదు. నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో అడుగులు వేశారు. గ‌త నెల 6వ తేదీ నుంచి మ‌హానేత త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లోనూ  పట్టువదలని విక్రమార్కుడిలా వడివడిగా నడుస్తూనే ఉన్నారు. అనంతపురం జిల్లా యాడికి మండలం బోగాలకట్టకు చెందిన వెన్నపూస నారాయణరెడ్డికి వైయ‌స్ఆర్‌ కుటుంబమంటే విపరీతమైన అభిమానం. గతంలో మ‌హానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలోనూ కొన్నాళ్లు పాల్గొన్నారు. ఇప్పుడు వైయ‌స్ జగన్‌ వెంట నడుస్తున్నారు. తండ్రీకొడుకుల వెంట పాదయాత్రలో పాల్గొనే అదృష్టం తనకు రావడం ఎనలేని అనుభూతినిస్తోందంటున్నారు. ఇలాంటి వారు ఎంద‌రో జ‌న‌నేత‌కు తోడుగా న‌డుస్తున్నారు. అడుగడుగునా వైయ‌స్ జగన్‌కు లభిస్తున్న ఆదరణ, ప్ర‌జ‌లు కనబరిచే ఆప్యాయతల ముందు అల‌స‌టే రావ‌డం లేద‌ని వెన్న‌పూస నారాయ‌ణ‌రెడ్డి పేర్కొంటున్నారు.  

Back to Top