వైయ‌స్‌ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారు

సినీ న‌టుడు  విశాల్ 
 

ఏపీ సీఎం వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ప్రముఖ హీరో విశాల్ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తారని అన్నారు. గతంలోనూ సీఎం వైయ‌స్ జగన్‌పై ఇలాంటి దాడులు జరిగాయని తెలిపారు. ఇలాంటి దాడులను జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని విశాల్ వెల్లడించారు. తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా లేనని.. కానీ సీఎం వైయ‌స్ జగన్‌ అంటేనే తనకు విపరీతమైన అభిమానమని విశాల్ తెలిపారు. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 
ప్రస్తుతం ఆయన రత్నం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం ఆయన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదారాబాద్‌లో పర్యటించిన విశాల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో మళ్లీ వైయ‌స్ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని విశాల్ అన్నారు.  

Back to Top