<br/>లోకేషం గారి ట్వీటేషం ఈమధ్య పలు రకాల తెలుగులతో పులకింతలుగా ఉంది. రీసెంట్ ట్వీట్ లో లోకేష్ ఇలా చెబుతున్నారు....కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం సిఎమ్ రమేష్ దీక్ష చేసి 100 రోజులైనందుకు బిజెపి ఐటి దాడులను బహుమతిగా ఇచ్చిందట...అదీ రాయలసీమకు, ప్రత్యేకించి ఆంధ్రాకట. పైగా ఇది పాతరాతియుగపు నయా నియంతృత్వపోకడట....వారెవ్వా లోకేష్ లో ఇంత తెలుగు దాగుందా...అది పాతరాతి యుగాల్లో చిక్కుకుపోయి...ఇప్పుడు తవ్వకాల్లో బైటపడిందా...అని తెలుగులో తెగ హాశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇంతకీ సీఎమ్ రమేష్ కంపెనీల్లో ఐటి దాడులు ఐతే అవి తెలుగురాష్ట్రానికి, రాయలసీమకు బహుమతులు ఎలా అయ్యాయి?? <br/>లోకేషం చెప్పాడంటే నిజయమే అయ్యుండొచ్చు...ఎందుకంటే ఐటి దాడుల విషయాన్ని బాకాలూది మరీ చెప్పి మేలు చేసిన ఎల్లో మీడియా, అంతకు ముందే తమ్ముళ్లూ మనపై దాడులు జరగొచ్చు జర భద్రం అంటూ పబ్లిక్ గా చెప్పి ముందే మేల్కొలిపి, కన్నంలో ఎలుకలను జారుకునేలా చేసిన చంద్రబాబు...వీరంతా రాష్ట్రానికి బహుమతులు కాక మరేమిటి? ద‌్రోహులు తప్పించుకునేలా, అవినీతిపరులు జాగ్రత్తపడేలా చేసిన ఈ సూచనలన్నీ బహుమతులు కాక మేరేమిటి? <br/>దివాళా సంస్థ అయినా కోట్ల రూపాయిల కాంట్రాక్టులు దక్కించుకున్న సీఎమ్ రమేష్, చదువును వ్యాపారంగా నడిపే నారాయణ వీరంతా టిడిపి అధినేతకు ఆర్థిక మూలస్తంభాలు. వీరిని కాపాడుకుని, మళ్లీ ప్రజల నెత్తిన కుచ్చు టోపీ పెట్టే అవకాశాన్ని కలిగించడం మాజీ పొత్తు పార్టీ కనీస ధర్మం. అందుకే ఐటి దాడుల లీకులిచ్చి, ఆపై ఆటి అధికారులను మందలుగా తోలిచ్చి, చివరకు తూచ్ అనిపిచ్చి, బోలెడంత సింపతీ అందిచ్చి...బహుమతులమీద బహుమతులు అందిచ్చి....ఇంతకంటే మీకేం చెప్పగలం...చెప్పండి...ఇదంతా లోకేషం ట్వీటబట్టి గానీ మనకేం తెలిసేను...ఈ వేషం...