తాచెడ్డ కోతి...

బురదంటిందేంటి బసవయ్యా అంటే కావలించుకున్నాను
నీకూ అంటింది లేవయ్యా అన్నాడట వెనకటికో పెద్దమనిషి. తనపై పడ్డ మచ్చను తుడిచేసుకునే
ప్రయత్నమైనా చేయకుండా పక్కవాళ్ల పైకి బురద చల్లే రకంలో ముందు రకం చంద్రబాబు. రాజధానికి
కూత వేటు దూరంలో ఉన్న దాచేపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, తప్పించుకు
పారిపోయి ఉరేసుకుని మరణించాడు 50 ఏళ్లు పైబడ్డ సుబ్బయ్య. ఈ విషయం న్యూస్ లో రాగానే
పచ్చ తమ్ముళ్లకు కండువాలు జారిపోయాయి. సొంత పార్టీ కార్యకర్త. పైగా యాక్టివ్
మెంబర్. అందుకే గదా దగ్గరుండి జన్మభూమి కమిటీలో ఇల్లు సాంక్షన్ చేయించి, ఇల్లు
కట్టుకోవడానికి డబ్బులు సాంక్షన్ చేయించింది. ఇప్పుడు అతను అధికారపార్టీకి చెందిన
వాడని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? కొంపలంటుకోవూ...మరేం చేయాలి...ఏముంది
ఎప్పటిలాగే...ఇంకోడి కొంప తగలేసి మనం తప్పించుకోవాలి. ప్రతిపక్షం మీద గుడ్డ కాల్చి
పడేయాలి. అందుకే పచ్చ బ్యాచ్ రంగంలోకి దిగింది. దాచేపల్లి ఘటనలో నిందితుడు వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త అంటూ ప్రచారం చేయడానికి ప్రయత్నించింది. కానీ
అనుకోకుండా సుబ్బయ్య టిడిపి కోటరీ మనషని రుజువు చేసే ఆధారాలు బయట పడ్డాయి. సాంబయ్య టిడిపి పార్టీ మెంబర్ షిప్ కార్డు, అతడికి ఎమ్మెల్యే
కోటాలో ఇల్లు, లోన్లు సాంక్షన్ కావడం వంటి వన్నీ ఆధారాలతో సహా బట్టబలవడంతో కంగుతిన్న
పార్టీ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి అత్యాచార
బాధితురాలి కుటుంబాన్ని కలిసి వరాలు కురిపించారు.

అయితే ఇక్కడే బాబు స్టాటజీ చూడాలి. చంద్రబాబు
కానీ, లేక ఆ పార్టీ నేతలు కానీ సుబ్బయ్య తమ పార్టీ వాడని, అనుచరుడని
నోరెత్తలేకపోతున్నారు. కానీ ఎలాగైనా ప్రతిపక్షానికి కూడా ఈ మకిలి కొంతైనా
అంటించాలని నానావిధాలుగా ఆరాటపడుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అలాంటి పనికి
పూనుకున్నాడు. మృతుడు సుబ్బయ్య తమ్ముడితో మాట్లాడుతూ సుబ్బయ్య బంధువులు వైఎస్సార్
కాంగ్రెస్ లో ఉన్నారా అంటూ ఆరా తీసాడు. సుబ్బయ్యకు వరసకు కొడుకు అయ్యే ఓ వ్యక్తి
వైఎస్సార కాంగ్రెస్ పార్టీ కీలక నేత అని తెలియజెప్పాలన్నది బాబు లక్ష్యం కావచ్చు.
కానీ నిందితుడే తమ అధికారపార్టీకి చెందిన వాడని, అతడికి అన్నివిధాలా పార్టీ
అండదండలిచ్చిందనే విషయాన్ని మరుగు పరచాలని ప్రయత్నిస్తున్నాడు. నిందితుడికి దగ్గరి
బంధువైనంత మాత్రాన మరొకరిని నేరస్థులుగా పరిగణిస్తారా? ప్రతిపక్ష పార్టీలో ఉన్న
కారణంగా అతడిపై బురద జల్లించాలన్న ప్రయత్నంలో చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలను
చేసినట్టు తేటతెల్లం అవుతోంది. నిజానికి రాష్ట్రంలో జరుగుతున్న నేరాలవెనక బయటపడుతున్న పేర్లని టిడిపి నేతలవే. కానీ
అలా బైట పడ్డ ప్రతిసారీ చంద్రబాబు అండ్ కో ప్రతిపక్షానికి చెందిన నేతలూ అందులో
ఉన్నారంటూ అబద్ధపు ప్రచారాలకు తెరతీస్తుంది. బాబుది ఇదో తరహా స్టేటజీ. తన తప్పులు
బైటపడ్డప్పుడు వాటిని కప్పేయడానికి, పక్కనున్న వాళ్లను కూడా ఆ రొంపిలోకి లాగేయాలని
చూడ్డం బాబు నైజం. ఇలాంటి సంక్షోభాలు, సమస్యలు ఎదురైనప్పుడు బాబుదంతా పలాయన మంత్రమే.

రాష్ట్రంలో పెరుగుతున్న విష సంస్కృతి వెనకున్న
మూలాలేమిటో చంద్రబాబుకు బాగా తెలుసు. తెలుగు తమ్ముళ్ళు పబ్లిక్ గా ఎన్ని సార్లు
మహిళను వేధించినా, చివరకు అధికారుల పైనే దాడులకు తెగబడ్డా చంద్రబాబు ఎలాంటి చర్యలూ
తీసుకోలేదు.యధానేతా తథా కార్యకర్తా అన్న తీరుగా టిడిపి
అధికార పక్షం, ఆ నేతల నేర చరిత్రలు, వారి అండదండలూ కింది స్థాయి వారిలోనూ నేర
లక్షణాలను పెంపొందిస్తున్నాయనటానికి సుబ్బయ్య ఘటనే ఓ తాజా ఉదాహరణ. 

Back to Top