దిక్పాలకులకూ అష్ట కష్టాలు

 • అష్ట దిక్పాలకుల  పని తీరు ఎలా ఉందో  ఓ సారి పరిశీలించాలని అనిపించింది బ్రహ్మదేవుడికి.
 • తను వస్తోన్నట్లు చెబితే దిక్పాలకులు  అప్రమత్తమైపోయి...పని చేస్తోన్నట్లు షో చేస్తారని బ్రహ్మకు అనుమానమేసింది. ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆకస్మిక తనిఖీ చేద్దామని నిర్ణయించుకున్నాడు.ఈ విషయాన్ని మూడో కంటికి కూడా తెలియనివ్వకూడదని అనుకున్నాడు. బ్రహ్మ ఇలా ఆలోచిస్తున్న సమయంలోనే స‌ర‌స్వ‌తీ దేవి ఏమిటి నాథా ఎన్నడూ లేనిది  ఇంత సీరియన్ గా ఆలోచిస్తున్నారు ఏమైందేంటి? అని అడిగింది.
 • తన మనసులో మాట స‌ర‌స్వ‌తీ దేవికి చెబితే ఇంకేమన్నా ఉందా..ఆడవారి నోటిలో నువ్వు గింజ కూడా నానదు అని అనుకున్న బ్రహ్మ ..అబ్బే  ఏం లేదు స‌ర‌స్వ‌తీ   నారద కుమారుని గురించి ఆలోచిస్తున్నానంతే అన్నాడు. స‌ర‌స్వ‌తీ తన పనిలో నిమగ్నం కాగానే బ్రహ్మదేవుడు ఇంద్రలోకానికి వచ్చాడు.
 • ఇంద్రుడు ఏం చేస్తున్నాడా అని  ఆరా తీద్దామని లోనికి అడుగు పెట్టగానే ఇంద్రుడు గురక పెట్టి నిద్రపోతూ కనిపించాడు. 
 • ఇంద్రుని నిద్రలేని బ్రహ్మ ఏంటి ఇంద్రా ఇలా నిద్రపోతే...నీ పనులు ఎవరు చేస్తారు? అని అడగాడు. దానికి ఇంద్రుడు కొంచెం సిగ్గుపడి.. లేదు దేవా...భూలోకంలో ప్రత్యేకించి  నా సింహాసనానికి ఎసరు పెట్టే ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పాలన ఉంది. అంచేత అక్కడ అధర్మం రాజ్యమేలుతోంది. నా సీటు పై కన్నేసే సీన్ ఎవ్వరికీ లేదని అనిపించి ఓ చిన్న కునుకు తీశానంతే అన్నాడు.
 • బ్రహ్మ అక్కడ మాయమై వరుణ దేవుడి ఛాంబర్ కి వెళ్లాడు.
 • వరుణ దేవుడు  స్నేహితులతో కలిసి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.
 • బ్రహ్మకి ఒళ్లు మండుకొచ్చింది.
 • వరుణా ఏంటిది? ఇది సెప్టెంబరు నెల. నువ్వు భూలోకంలో చాలా బిజీగా ఉంటావేమో అనుకున్నా.నువ్వేమో ఇక్కడ  కులాసాగా ఉన్నావు ఏంటి సంగతి ? అని సీరియస్ గా అడిగాడు.
 • బ్రహ్మ కోపాన్ని చూసి వరుణుడు వణికాడు.
 • క్షమించండి ప్రభూ... ఇందులో నా తప్పేమీ లేదు.
 • మనల్ని బాగా కొలిచే తెలుగు రాష్ట్రాల్లో  ఒక చోట చంద్రబాబు నాయుడు కొలువు తీరాడు.
 • ఆయనకు మీరు గతం లో ఇచ్చిన వరం ప్రకారమే నేను ఇక్కడ ఉండిపోయాను అన్నాడు.
 • బ్రహ్మకి మళ్లీ కోపం వచ్చింది. ఏం పిచ్చ పిచ్చగా ఉందా?  నేనేంటి ? వరం ఇవ్వడమేంటి? అందుకని నువ్వు నీ పనులు మానేసి ఇక్కడ ఉండడమేంటి? అని అడిగాడు.
 • వరుణుడు  చేతులు జోడించి..మహప్రభో  శాంతి శాంతి.
 • 1990లలో  ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన చంద్రబాబు నాయుడు తమరి కోసం ఘోరతపస్సు చేశాడు. మీరు ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అని అడిగారు. తాను అధికారంలో ఉన్నంత కాలం వరుణదేవుడు నా  రాజ్యంలో అడుగు పెట్టకుండా వరమియ్యి స్వామీ అని చంద్రబాబు మిమ్మల్ని కోరుకున్నాడు. మీరు తెలుగు రైతుల కష్టాలు  ఆలోచించకుండా చంద్రబాబుకు వరమిచ్చారు.
 • అందుకే ఆయన మొదటి సారి 9 సంవత్సరాల పాటు సిఎం గా ఉన్నప్పుడు నేను ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. ఆంధ్ర  ప్రదేశ్  వర్షాలు లేక కరవు కాటకాలతో దుర్భిక్షంలో కూరుకుపోయింది.
 • ఆ తర్వాత వై.ఎస్.రాజశేఖర రెడ్డి రాజ్యం వచ్చింది. 
 • ఆయన నాయకత్వ లక్షణాలు..పరిపాలనా దక్షత..ప్రజల పట్ల ఆయనకున్న ఆప్యాయతా చూసి నేను కరిగిపోయాను. అప్పుడే నేను  వై.ఎస్. ఆర్. పార్టీలో చేరిపోయాను. అందుకే ఆయన ఉన్నంత కాలం ఏపీలో వర్షాలు కురిపించాను. రైతులు సుఖంగా ఉన్నారు.
 • గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మళ్లీ సిఎం అయ్యారు.
 • అయ్యీ అవ్వడంతోనే  నా వైపు కోపంగా చూశారు.
 • అందుకే నేను ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చేసి ఇదిగో ఇలా కాలక్షేపం చేస్తున్నాను.
 • 2019 వరకు నాకక్కడ పని లేదు. అని బాబు బ్రహ్మ తపస్సు పరిణామ వృత్తాంతం  చెప్పాడు వరుణుడు.
 • బ్రహ్మ దేవుడు ఏమీ  అనలేక  యమలోకానికి వెళ్లాడు.
 • లక్షల సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత బిజీగా యముడు తన భటులకు ఏవో పనులు ఆదేశిస్తూనే ఉననాడు. క్షణం తీరిక లేకుండా కంప్యూటర్ ముందేసుకుని ఏవేవో లెక్కలు చూసుకుంటూ ఉన్నాడు.
 • బ్రహ్మదేవుడికి సంతోషం వేసింది. కనీసం యముడైనా బాగా పని చేస్తున్నాడని సంబర పడిపోయాడు.
 • యముడి దగ్గరకు వచ్చి ..నువ్వు నచ్చావు యమా..బాగా పని చేస్తున్నావు అని మెచ్చుకున్నాడు.
 • బ్రహ్మ దేవుడికి నమస్కరించి..దేవా  ఈ చావు లెక్కలతో  చచ్చిపోతున్నానండీ బాబూ.
 • ఓ 15 నెలల నుంచీ  వర్క్ లోడ్ మరీ పెరిగిపోయింది అన్నాడు.
 • ఏంటి విశేషం? ఏమైందసలు ? అని అడిగాడు బ్రహ్మ దేవుడు.
 • ఏమవ్వడం ఏంటి దేవా..ఏపీలో చంద్రబాబు సిఎం అయ్యిన క్షణం నుంచి  క్షణం తీరిక లేకుండా ప్రాణాలు తోడేస్తూనే ఉన్నాను. ఎర్ర చందనం కూలీలను  ఉత్తి పుణ్యాన కాల్పించాం...కాలేజీల్లో అమ్మాయిలను మేమే ఆత్మహత్యలు చేయించాం...పుష్కర ఘాట్ లో ముసలీ ముతకా పిల్లా పీచూ అని  చూడకుండా  ప్రాణాలు గాల్లో కలిపేశాం...రుణమాఫీ  హామీ అమలు కాక బాధల్లో ఉన్న రైతులకు పురుగు మందులిచ్చి చంపేశాం...అబ్బో ఏదో ఒక కారణంతో మాకసలు రెస్ట్ లేకుండా చంపుతూనే ఉన్నాం అని యముడు వివరించాడు.
 • బ్రహ్మ దేవుడు తృప్తిగా అక్కడి నుంచి కదిలాడు. 
 • అగ్నిదేవుడి ఛాంబర్ కి వచ్చాడు. అగ్ని దేవుడు మండిపడుతూ ఉన్నాడు. ఏంటి అగ్ని దేవా ఏం చేస్తున్నావు అని అడిగాడు బ్రహ్మ దేవుడు.
 • ఏం చెప్పమంటావు దేవా...ఏపీలో చంద్రబాబు సిఎం అయ్యాక...లక్షలాది మంది జీవితాలను పెట్రోల్ అవసరం లేకుండా కాల్చి పారేశాను. అస్సలు తీరికే లేదు.అని వివరించాడు.
 • బ్రహ్మదేవుడు అక్కడి నుంచి కుబేరుడి దగ్గరకు వెళ్లాడు.
 • కుబేరుడు  ఏపీ రాజధాని ప్రతిపాదిత ప్రాంతానికి వెళ్లాడని తెలిసి అక్కడికే వెళ్లాడు బ్రహ్మ.
 • ఏంటి కుబేరా ఏం చేస్తున్నావు? అని అడిగాడు.
 • కుబేరుడు   పదికి పైగా డెబిట్..క్రెడిట్ కార్డులను జేబులో కుక్కుకుని..బ్రహ్మదేవుడికి దండం పెట్టాడు.
 • ఏం లేదు దేవా. ఇక్కడ పేదల నుంచి భూములు లాక్కుని  సింగపూర్ కంపెనీలకు..ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని తెలిసి వచ్చాను. మన రైతుల సంపద అంతా పెద్ద జలగలకు ఇస్తారని అంటున్నారు. అందుకే ఇక్కడుంటే నాకూ ప్రమాదమేనని గ్రహించి మన లోకానికి పయనమవుతున్నాను..మీరు ఎదురయ్యారు అని చెప్పాడు కుబేరుడు.
 • బ్రహ్మదేవుడు ఏదో ఆలోచించుకుంటూ సర్లే ఇక మిగతా దిక్పాలకుల గురించి తెలుసుకోనవసరం లేదు.వీలుంటే మళ్లీ 2019 లో వస్తాలే. అని చెప్పి మాయమయ్యాడు.
 • బ్రహ్మలోకానికి వెళ్లి న సృష్టికర్త అలసటతో కునుకు తీశాడు.
 • గాఢ నిద్రలో చంద్రబాబు నాయుడు కలలోకొచ్చి ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాడు. 
 • ఏంటి అంతలా ఉలిక్కి పడ్డారు అని అడిగింది స‌ర‌స్వ‌తీ దేవి.
 • కంగారు పడ్డ బ్రహ్మదేవుడు అబ్బే ఏం లేదు ఏం లేదు అన్నాడు.
 • స‌ర‌స్వ‌తీ దేవి చిద్విలాసంగా నవ్వుకుంది.
-కవికాకి
Back to Top