పది సూత్రాల పాలన..

ఏడాదిన్నర పాలనపై ప్రజలకు చంద్రబాబు ఒక నివేదిక సమర్పించాడు.

1) మూవ్ మెంట్ ఈజ్ నథింగ్ బట్ డెవలప్ మెంట్. ప్రయాణించడం వల్లే మనం ప్రపంచాన్ని తెలుసుకుంటాం. అందుకే నేను పాతికసార్లు ఢిల్లీకి, పదిసార్లు సింగపూర్ కి, ఐదుసార్లు మలేషియాకి వెళ్లి వచ్చాను. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి రాష్ట్రానికి ఒక ప్లాన్ తయారుచేసుకున్నాను
అదేమిటంటే రాష్ట్రంలో ప్రజలంతా విరివిగా ప్రయాణాలు చేయాలి. ఇప్పటికే పంటలు లేక వేలాదిమంది కూలీలు వలసవెళ్లిపోయారు. కేరళలో కూడా మనవాళ్లు కూలీ పనులు చేస్తున్నారంటే అది మనకు గర్వకారణం.

2) ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటుచేస్తాను. బాబు వచ్చినా జాబులు రావని ఇప్పటికే జనానికి అర్థమైంది కాబట్టి  చదువుకున్నవాళ్లంతా చచ్చీచెడి ఏదో ఒక పనికోసం గల్ఫ్ కంట్రీలకు వెళ్లకతప్పదు. అప్పుడు వాళ్లకి రిస్క్ లేకుండా విమానాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా విమానాలే చూడని పేదప్రజలకు  టికెట్ పెట్టి విమానాలను చూపించడం వల్ల వినోదానికి వినోదం, ఆదాయానికి ఆదాయం.

3)ప్రతి శాఖకు గ్రేడింగ్ లు ఇవ్వడం నా స్పెషాలిటీ. ఆస్పత్రిలో కుక్కలు వచ్చి కరిస్తే ఎ గ్రేడ్, ఎలుకలు కరిస్తే బి గ్రేడ్, బొద్దింకలు  కరిస్తే సి గ్రేడ్, ఆస్పత్రిలోనే ఏదో ఒక కీటకం కరవడం వల్ల రోగులకు ఉపయోగం ఏమంటే వాళ్లు చస్తే పోస్టుమార్టం వెంటనే జరిగిపోతుంది.

4) అమరావతి నిర్మాణానికి వూరురు నుంచి మట్టి తీసుకురమ్మని పిలుపు ఇవ్వడానికి కారణం ఏమంటే పున్న డబ్బంతా అమరావతికే ఖర్చుపెడతాను.  కాబట్టి జనానికి ఎలాగూ చివరకు మిగిలేది మట్టే. 

5)సినిమాలు చూసి కష్టాలు మరిచిపోయే అలవాటు ప్రజలకు ఉందని నాకు తెలుసు. అందువల్ల వాళ్లకి అమరావతి అనే సినిమాస్కోప్ సినిమా చూపిస్తే  తిండితిప్పలు  లేని విషయం మరచిపోతారు. గతంలో కూడా నేను ఇదే టెక్నిక్ తో పాలించి రాష్ట్రంలోని పరిశ్రమలన్నీ మూయించాను.

6)తరచూ వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టడం వల్ల ఉపయోగం ఏమంటే కనీసం అధికారులు కూడా నాలాగే పనిచేస్తున్నట్టు నటిస్తారు.

7) వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఎలాగూ ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి అభివృద్ధి పేరుతో వాళ్ల భూముల్ని  లాక్కొని ఒకరకంగా వాళ్లకు ప్రాణదానం చేసాను.

8) పరిశ్రమలు స్థాపించినా, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినా ప్రభుత్వానికి  ఒరిగేదేమీలేదు. కాంట్రక్టర్లని బాగుపరిస్తే ప్రభుత్వానికి ముడుపులొస్తాయి. ప్రజల కడుపులు మాడితే మాకేంటి..? మాకు కావల్సింది ముడుపులు.

9) నేను ఎలా పనిచేస్తానో గతంలో చూసి కూడా మళ్లీ నన్నే ఎన్నుకున్నారంటే ప్రజలు గొర్రెలని రుజువైంది. అందువల్ల 
పీకకోసినా వాళ్లేం పట్టించుకోరు. 

10) అరచేతిలో అమరావతి చూపించి , పెళ్లిలో అరుంధతి నక్షత్రంలా అభివృద్ధిని చూపిస్తున్నాను.  ఎవడికీ కనబడకపోయినా కోట్లాదిమంది  అరుంధతిని చూసామనే అనుకుంటారు కాబట్టి అదే నాబలం.
Back to Top