కరువు, చంద్రబాబు కవల పిల్లలు అన్న సంగతి తెలిసిందే. అందుకే చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ వరుణుడు దూరంగా ఉంటాడు. కొన్ని రోజులుగా చంద్రబాబు హైదరాబాద్ కు దూరంగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టారు. హైదరాబాద్ కు మంచి రోజులు వచ్చినట్లున్నాయి. అప్పటి దాకా ఎండలు మాడగొట్టినప్పటికీ వరుణుడు ఇప్పుడు పలకరిస్తున్నాడు.చంద్రబాబు నగరానికి దూరంగా ఉంటున్నాడని తెలిసి వానదేవుడు హైదరాబాద్ కు చేరుకొన్నాడు.అందుకే నాలుగైదురోజులుగా హైదరాబాద్ లో జల్లులు పలకరిస్తున్నాయి. వాతావరణం పూర్తిగా తేలిక పడింది.దీంతో నగర వాసులు మాత్రం దేవుడిని కోరుకొంటున్నారు. కొన్ని రోజులు చంద్రబాబు అలాగే ఉంటే బాగుండు. లేదంటే ఏ సింగపూర్ కో వెళితే బాగుండు.అప్పుడు మరి కాస్త బలంగా వానలు పడి హైదరాబాద్ కు చల్లదనం వస్తుంది.