రాజకీయాలు VS ప్రజాసంక్షేమం

*పట్టువదలని విక్రమార్కుడు స్మశానం లో అడుగు పెట్టాడు.
శవం వేలాడుతోన్న చెట్టువైపునకు అడుగులో అడుగేస్తూ సాగుతున్నాడు.
విక్రమార్కుని చూడగానే బేతాళుడు నవ్వాడు.
"ఏం విక్రమార్కా?  ఏంటి ఏదో  ఆలోచనలో ఉన్నట్లున్నావు?  ఏంటి సంగతి? ఏమైందేంటి? "  అని అడిగాడు.
దానికి విక్రమార్కుడు నవ్వి
*" ఏం లేదు బేతాళా.!  మా ఏపీ ముఖ్యమంత్రిని చూస్తోంటే...నవ్వొస్తోంది. ఓ మూలేమో రాష్ట్రం పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో ఉందని బీద అరుపులు అరుస్తారు..మరో పక్కేమో  ఏ రాష్ట్ర రాజధానికీ లేని విధంగా 35 వేల ఎకరాలకు పైగా భూములు సేకరించేసి.. రాజధాని నగర నిర్మాణ ఆరంభోత్సవానికి  దేశం నలుమూలల నుండి అందరినీ పిలిచి ఆర్భాటాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు." అని విక్రమార్కుడు చెప్పాడు.

*దానికి బేతాళుడు కూడా నవ్వి  ...సరేలే కానీ  ఇపుడు నేనో కథ చెబుతాను అలసట తెలీకుండా సావధానంగా విను. అని కథ చెప్పడం మొదలు పెట్టాడు.
" విక్రమార్కా... ఆంధ్ర ప్రదేశ్ కు  ప్రత్యేక హోదా విషయంలో  పాలక ప్రతిపక్షాల వైఖరి భలే చిత్రంగా అనిపిస్తోంది. ప్రత్యేక హోదాను సాధించుకోవలసిన బాధ్యత..అవసరం రెండూ కూడా అధికారంలో ఉన్న  టిడిపి ప్రభుత్వానివే. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడివే. అలాంటి చంద్రబాబు నాయుడు ఎందుకనో కానీ హోదా ను పక్కన పెట్టేశారు. అంతటితో ఆగకుండా  ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తోన్న  ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి దీక్ష ను దెబ్బతీయడానికి రక రకాల కుట్రలు పన్ని చివరకు బలవంతంగా భగ్నం చేశారు. నిజానికి ఏ ప్రతిపక్షమైనా అధికారంలో ఉన్న పక్షం ఏ విషయంలో  ఎలా విఫలమవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది.  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ స్థానంలో మరో రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ప్రత్యేక హోదా కోసం పాలక పక్షం ప్రయత్నం చేయనపుడు మౌనంగా ఉండిపోయేది. కానీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వం తన బాధ్యతలను  మర్చిపోయినట్లు నటిస్తూ పక్కన పెడితే...తానే ఆ బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. పాలక పక్షం లేని పోని ఆరోపణలు..రాజకీయాలతో అవమానించే ప్రయత్నం చేసినా కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని ఆపలేదు సరికదా మరింత ఉధృతం చేస్తున్నారు. ప్రత్యేక హోదా  రాకపోతే...చంద్రబాబు ప్రభుత్వమే ఇబ్బందుల్లో పడుతుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోడానికి వీలుండదు. హోదా వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి జాక్ పాట్ తగిలినట్లే. మరి  రాజకీయ ప్రత్యర్ధి అయిన చంద్రబాబుకు ఇంత మేలు చేసే  ప్రత్యేక హోదా కోసం జగన్ మోహన్ రెడ్డి ప్రాణాలకు సైతం తెగించి నిరవధిక దీక్షలు చేయడమేంటి?  
హోదా  తో దర్జాగా ఉండచ్చని తెలిసినా చంద్రబాబు  ..ఆయన మంత్రులు కూడా హోదా కోసం పోరాడుతోన్న జగన్  మోహన్ రెడ్డికి ఆటంకాలు సృష్టించడమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసీ కూడా చెప్పలేకపోయావో నీ తల వెయ్యి ముక్కలైపోతుంది" అని బేతాళుడు కథ ముగించాడు.

*విక్రమార్కుడు ఒక్క క్షణం నిశితంగా ఆలోచించి...చెప్పడం మొదలు పెట్టాడు.

" బేతాళా..! నువ్వు చెప్పినట్లు ప్రత్యేక హోదా వచ్చిందనుకో చంద్రబాబు నాయుడు పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోడానికి మంచి అవకాశం వస్తుంది. కానీ ఆయనకు అది ముఖ్యం కాదు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచీ పోరాడుతున్నది వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే. ఈ పోరాటాలకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చిందనుకో   5 కోట్ల మంది ఆంధ్రుల హృదయాల్లో జగన్ మోహన్ రెడ్డి హీరో అయిపోతారు. అది చంద్రబాబుకు ఇష్టం లేదు. హోదా రాకపోతే రాష్ట్రం బాగా నష్టపోతుంది. అయినా అది చంద్రబాబుకు పరవాలేదు. ఎందుకంటే రాష్ట్రం ..రాష్ట్ర ప్రజలు ఎలా పోయినా పరవాలేదు కానీ..ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి మంచి పేరు రావడానికి వీల్లేదన్నదే చంద్రబాబు ఫిలాసఫీ. అందుకే ఆయన ప్రత్యేక హోదా కు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. దాని కోసం పోరాడుతోన్న జగన్ పై మంత్రుల చేత విమర్శలు చేయిస్తున్నారు.

*ఇక జగన్ మోహన్ రెడ్డి విషయానికి వద్దాం .

తన పోరాటాల కారణంగా..కేంద్రం కదిలి ప్రత్యేక హోదా ఇస్తే..అది తన రాజకీయ ప్రత్యర్ధి అయిన చంద్రబాబుకు  మేలు చేస్తుంది. అయినా జగన్ మోహన్ రెడ్డికి అభ్యంతరం లేదు. ఎందుకంటే హోదా వస్తే 5 కోట్ల మంది ఆంధ్రులకు మంచి రోజులు వస్తాయి. యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. రాష్ట్రం సిరిసంపదలతో తులతూగుతుంది. రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది.  ప్రజలకు ఇన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది కాబట్టే జగన్ మోహన్ రెడ్డి హోదా కోసం పోరాడుతున్నారు. ఇక హోదాను తాను సాధించినా ఆ క్రెడిట్ ను చంద్రబాబు నాయుడు సొంతం చేసుకున్నా కూడా తనకు అభ్యంతరం లేదని  జగన్ మోహన్ రెడ్డి శాసన సభ సాక్షిగానే స్పష్టం చేశారు.
చంద్రబాబు తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం..
జగన్ మోహన్ రెడ్డికి మంచి పేరు రాకుండా ఉండేందుకోసం హోదా కు అడ్డుపడుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి 5 కోట్ల మంది ఆంధ్రుల మేలు కోసం రాజకీయంగా తనకు ఎలాంటి ప్రయోజనాలూ చేకూరకపోయినా పరవాలేదని రాజకీయాలకు అతీతంగా ఆలోచించారు. అదే ఇద్దరి మధ్య ఉన్న తేడా" అని విక్రమార్కుడు చెప్పగానే..సమాధానానికి సంతృప్తి చెందిన బేతాళుడు అమాంతం మాయమై తిరిగి చెట్టుకు వేలాడాడు.

తాజా ఫోటోలు

Back to Top