నారా గిరీశం బాబు నాయుడు

తాత్కాలిక సచివాలయంలో మీడియా మిత్రులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఓ సీనియర్ జర్నలిస్ట్ కల్పించుకుని అయ్యా ముఖ్యమంత్రి గారూ మీరీ మధ్యనే టెక్నాలజీయే నా మిత్రుడు అని అన్నారు గుర్తుందా? అని అడిగాడు.
దానికి చంద్రబాబు నాయుడు చాలా గర్వంగా నవ్వుతూ.."అవును. టెక్నాలజీని మించిన మిత్రుడు ఎవరూ ఉండరు నేను టెక్నాలజీకే పెద్ద పీట వేస్తాను. అసలు ప్రపంచానికి టెక్నాలజీని అలవాటు చేసిందే నేను " అని  చెప్పుకొచ్చారు.
మరో జర్నలిస్టు లేచి  మీ దగ్గర టెక్నాలజీకి లోటు లేదు కదా..మరి మీ ప్రభుత్వం ఏంటి సార్? తెలంగాణా వాళ్ల ఆన్ లైన్ అప్లికేషన్ ని కాపీ కొట్టడమేంటి? అసియ్యంగా? మీరే ఓ కొత్త అప్లికేషన్ ని తయారు చేసుకోవచ్చు కదా? అనవసరంగా పరువు తీసేశారండీ బాబూ" అని నిష్ఠూరంగా అనే సరికి చంద్రబాబుకి కోపం వచ్చింది.
తెలంగాణ వాళ్లకి వేరే పని ఏమీ లేదు.
మాకు బోలెడు పనులు ఉన్నాయి. మేం రాజధాని కొత్తగా కట్టుకోవాలి. పరిశ్రమలు కొత్తవి పెట్టుకోవాలి.. హై కోర్టు కొత్తది కట్టుకోవాలి...ప్రాజెక్టులు కొత్తవి కట్టుకోవాలి...దేశ విదేశాలు తిరుగుతూ ఉండాలి... కాబట్టి మాకు టైం ఉండదు.
తెలంగాణ వాళ్లు ఏ పనీ చేయరు కాబట్టి తీరిక ఉంటుంది కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  కోసం అప్లికేషన్ తయారు చేశారు.
అయినా అంత అప్లికేషన్ చేసిన వాళ్లు దాన్ని ఎవరూ కొట్టేయకుండా ఆపుకునే టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి కదా.
మేం కాపీ కొట్టాం అంటున్నారు.
నిజమే.. అది కూడా ఓ టెక్నాలజీయే.
కాపీ..పేస్ట్ చేయడమంటే మాటలా ఏంటి?
అయినా మై డియర్ గిరీశం గారు ఏమన్నారంటే... బెగ్..బారో ..ఆర్ స్టీల్ అన్నారు.
తెలంగాణ వాళ్లని మీ అప్లికేషన్ దానం చేయండహో అని మేం బెగ్ చేయలేం.
మీ అప్లికేషన్ ఓ సారి వాడుకుని ఇచ్చేస్తాం ఇవ్వండని బారో చేయలేం.
అయినా వాళ్లని అడిగేదేంటి? దర్జాగా కాపీ కొట్టే మార్గం ఉండగా.. అందుకే కాపీ కొట్టాం. అయితే ఇపుడేంటట? అని అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు.
మరో జర్నలిస్ట్ నిలబడి సార్ మీరు ఏపీని నంబర్ వన్ ని చేస్తామన్నారు కదా ఎప్పుడు చేస్తారు? అని అడిగాడు.
దానికి చంద్రబాబు చిన్నగా నవ్వి..." మంచి ప్రశ్న వేశారు. ఏపీని నంబర్ వన్ ని చేసి తీరతాం.
అందుకే త్వరలోనే ఏపీలో ఒలింపిక్స్ నిర్వహించబోతున్నాం" అని అన్నారు.
ఆ జర్నలిస్ట్ షాక్ కి తట్టుకోలేక కింద పడిపోయాడు.
ఏంటి? ఒలింపిక్సా? ఏపీలోనా? ఎప్పుడు నిర్వహిస్తారు సార్? అని మరో స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఆసక్తిగా ఆరా తీశాడు. దానికి చంద్రబాబు నాయుడు తడుముకోకుండా 2019 ఎన్నికలలోపే ఏపీలో ఒలింపిక్స్ జరిపి తీరతాం అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ వెంటనే లేచి అయ్యా 2024 వరకు ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించి దేశాలు..తేదీలు ఎప్పుడో ఖరారైపోయాయి. ఒక వేళ మీరు ఒలింపిక్స్ నిర్వహించాలనుకుంటే 2026లో వింటర్ ఒలింపిక్స్ కానీ..లేదంటే 2028 లో సమ్మర్ ఒలింపిక్స్ కానీ నిర్వహించాలి. వాటికైనా మీరు ఇప్పుడే బిడ్ వేయాలి. అది కూడా రాష్ట్రాల తరపున బిడ్ వేయడానికి ఉండదు. దేశం తరపున వేయాలి. మరి దేశం తరపున మీరెలా బిడ్ వేస్తారు? అని ప్రశ్నల వర్షం కురిపించేసరికి చంద్రబాబునాయుడికి కంగారొచ్చింది. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే ఒలింపిక్స్ నిర్వహిస్తాం.అయినా దేశం తరపున మేం బిడ్ వేయకూడదా ఏంటి? మేం గతంలోనూ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాం మర్చిపోయారా? అని గతాన్ని తవ్వారు.ఒలింపిక్స్ మీద చంద్రబాబు నాయుడు బొత్తిగా అవగాహన లేకుండా మాట్లాడ్డంతో ఆయనతో వాదించడం దండగని సీనియర్ జర్నలిస్టులు మౌనంగా ఉండిపోయారు.అంతలో ప్రపంచ అవినీతి పరుల సమాఖ్య  ప్రతినిథుల బృందం ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చింది. మీడియా మిత్రుల సమక్షంలోనే ఆ బృందం చంద్రబాబు నాయుడి దగ్గరకు వచ్చి దుశ్శాలువ కప్పి..అయ్యా తమరి నాయకత్వంలో  రెండేళ్లలోనే ఆంధ్ర ప్రదేశ్ ను అవినీతిలో దేశంలోనే నంబర్ వన్ గా నిలబెట్టారు. అందుకే మిమ్మల్ని వచ్చే ఆగస్టు 15 న ఎర్రకోట దగ్గర సన్మానించాలని అనుకుంటున్నాం అని చెప్పగానే చంద్రబాబు నాయుడు పొంగిపోయారు. మా మీడియా వాళ్లని కూడా తీసుకు రండి మాంచి కవరేజి ఇస్తారు అని వారికి ఉచిత సలహా ఇచ్చారు. సన్మానం చేయించుకున్నందుకు  అమరావతికి ఎంతో కొంత విరాళం ఇస్తేనే వస్తానని చంద్రబాబు షరతు విధించారు. దాంతో సమాఖ్య ప్రతినిథులు చంద్రబాబు నాయుడి ప్రొఫెషనలిజాన్ని చూసి తెగ ముచ్చటపడిపోయారు.
మీడియా వాళ్లు తలలు బాదుకున్నారు.
Back to Top