లోకేష్ బాబు ఫోటో జెనిక్ ఫేస్..!

లోకేష్ బాబు చాలా సీరియస్ గా ఉన్నాడు.
అపుడే పిఏ గుర్నాథం వచ్చాడు.
ఏంటి బాబూ అదోలా ఉన్నారు? ఏమైందేంటి? అని నెమ్మదిగా అడిగాడు.
తన టేబుల్ పై ఉన్న  కంప్యూటర్ వైపే సీరియస్ గా చూస్తున్నాడు లోకేష్ బాబు.
పక్కకు వెళ్లి లోకేష్ ఏం చూస్తున్నారా అని చూశాడు గుర్నాథం.
లోకేష్ బాబు మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు క్లాస్ తీసుకుంటోంటే.. భయంతో సగం వంగి వినయంగా నిలబడి ఉన్నారు రాజప్ప.ఆ ఫోటోకేసే చూస్తున్నాడు లోకేష్ బాబు.
"ఏంటి బాబూ అదే పనిగా అదే ఫోటోని చూస్తున్నారు" అన్నాడు గుర్నాథం.
లోకేష్ ఈ లోకంలోకి వచ్చాడు.

చూడవయ్యా చూడు. వైయస్సార్సీపీ వాళ్లు ఏం చేశారో చూడు అన్నాడు.
ఏం చేశారు బాబూ అని  సణిగాడు గుర్నాథం.
నన్ను చూసి రాజప్ప భయపడిపోతోన్న ఫోటో ప్రచారం లోకి తెచ్చేరు. అన్నాడు లోకేష్ బాబు.
గుర్నాథం   కంగారు పడి... మనోళ్లు ఫోటో లీక్ చేయకుండా ఉంటే... అంటూ  నసిగాడు.
లోకేష్ కి ఇంకా కోపం వచ్చింది.
ఏవయ్యా గుర్నాథం చిన రాజప్ప భయపడుతోన్న ఫోటో ఉంది చూశేవూ బ్రహ్మాండంగా ఉందయ్యా.  వాళ్లు ప్రచారం చేయబట్టి పార్టీలో..ప్రభుత్వంలో మన పవరేంటో ఇపుడు అందరికీ తెలిసొస్తుంది కదా " అని గర్వంతో కూడిన నవ్వొకటి విసిరాడు లోకేష్ బాబు.
మరయితే ఇందాకట్నుంచి అంత సీరియస్ గా ఉన్నారేటండీ బాబూ. నేను భయపడిపోనాను అన్నాడు గుర్నాథం.
అదా..  వాళ్లకి నేనంటి గిట్టదురా నాయనా అన్నాడు లోకేష్.
మళ్లీ ఇదేం తిరకాసురా అనుకున్నాడు గుర్నాథం.

గుర్నాథం ఫేస్ క్వశ్చన్ మార్క్ లా కనిపించడంతో.. " నీకర్ధం కాలేదని నాకకర్ధమైందిలే కానీ..  వాళ్లు రాజప్ప భయపడుతోన్న ఫోటో వేసి ఊరుకున్నారు. ఏం మనమంటే భయపడని మంత్రులు ఇంకెవరూ లేరా? ఉన్నారు కదా.   చీటికీ మాటికి ఎవరో ఒకరిని  ఏదో ఒక విషయానికి  క్లాసులు పీకుతూనే ఉన్నా కదా. మరి అప్పుడు ఆ మంత్రులు కూడా భయంతో వణికిపోయారు కదా. ఆ ఫోటోలు ఎందుకు వేయలేదంటవాళ్లు? అని ఆరా తీశాడు లోకేష్ బాబు.
అవునండీ బాబూ. మీరు చెబితే అర్ధమవుతోంది. నిజవే.మరి ఆఫోటోలు కూడా వేయాలి కదా. ఎందుకు వేయలేదంటారు? అని ఎదురు ప్రశ్నించాడు గుర్నాథం.
"ఎందుకేంట్రా... మన పాపులారిటీ పెరిగిపోతుందని భయం వాళ్లకి" అని   కసిగా అన్నాడు లోకేష్ బాబు. మరి మీరు కూడా   వైయస్సార్సీపీ వాళ్లకి ఏదో లెటర్ రాశారంట కదా బాబూ.
అన్నాడు గుర్నాథం.
అవున్రా... విలువలు..సంస్కారం ఉండాలని అన్నాను. అలాగైనా  మిగతా మంత్రులు భయపడుతోన్న ఫోటోలు వేస్తారని అలా అన్నాను.
మరి మీ లెటర్ చూశాక వాళ్లేం చేశారు బాబూ? అనడిగాడు గుర్నాథం.

మంత్రుల ఫోటోలు వేయాలి కదా. అవి వేయలేదు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ లీడర్ అంబటి రాంబాబు ఉన్నారు కదా. ఆయనగారేమో నేను అమెరికాలో  అమ్మాయిలతో సరదాగా తాగి తిరిగి తందనాలాది..స్విమ్మింగ్ పూల్ లో ఈతలాడి.. హుషారుగా గడిపిన  ఘటనల తాలూకు ఫోటో ఆల్బమ్ ని అంబటి గారు విడుదల చేశారంట. ఆఫోటోలు వేసేశారు  వాళ్లు అని లోకేష్ కోపంగా అన్నాడు.
"పోనీలేండి. మంతురుల ఫోటోల కన్నా కూడా అమ్మాయిలతో మీరు దిగిన పోటోలయితే పాపులారిటీ ఇంకా పెరుగుతుందండీ బాబూ" అన్నాడు గుర్నాథం.
గుర్నాథం పొగుడుతున్నాడో..తిడుతున్నాడో అర్ధం కాలేదు లోకేష్ బాబుకి. గుర్నాథాన్ని తీక్షణంగా చూశాక తిట్టడం లేదని అర్ధమైంది. అది కాదెహె.. ఇపుడా ఫోటోలు చూసి మా నాన్నగారు పొద్దున్నే  ఫోనులోనే క్లాసు తీసుకున్నారు. " అన్నాడు లోకేష్ బాబు.
" తిడితే తిట్టారు కానీ.. ఈ పోటోలు అమ్మాయిలు కానీ చూశారా మీ పాపులారిటీ డబుల్ అవుతుంది అన్నాడు గుర్నాథం."
అంతేనంటావా అన్నాడు లోకేష్ బాబు.
మీమీదొట్టండీ బాబూ.  ఆడోళ్లకి ఈ పోటోలు బాగా నచ్చుతాయి. కావాలంటే మీ ఇంటికి కూడా పోటోలు పంపండి అన్నాడు గుర్నాథం.

ఇపుడిక చూసుకోండి  మీ పాపులారిటీ ...అంటూ గుర్నాథం సాగదీసుకుంటూ  అంటోండగానే.. ఇంటి దగ్గర నుంచి ఫోను మోగింది.లోకేష్ బాబు ఫోను ఎత్తి హలో  చూశావా అని అడుగుతున్న మనిషి అడుగుతోన్నట్లే ఆగిపోయి ..వింటున్నాడు. ఫోన్లో అవతల ఎవరో తెలీదు కానీ.. లోకేష్ బాబు మొహంలో రంగులు మారిపోతున్నాయి.
అయిదు నిముషాలు నరకాన్ని అనుభవించి లోకేష్ ఫోను పెట్టేశాడు.
లోకేష్ ని చూసి.. నేను చెప్పినట్లే అయ్యిందా  బాబూ అని గర్వంగా అడిగాడు.
లోకేష్ ..గుర్నాథాన్ని చూసి ఇలా రావయ్యా అన్నాడు. గుర్నాథం వెళ్లాడు. గుర్నాథం చెంప చెళ్లు మంది.
ఇదేంటండీ ఇలా కొట్టారు అని ఏడుస్తూ అడిగాడు గుర్నాథం.
ఏమైంది అని అడిగావు కదా. ఇపుడు ఇంటికి వెళితే ఏమవుతుందో తెలిసిందా..!
నీ కన్నా వైయస్సార్సీపీ వాళ్లే నయం అని సణుక్కుంటూ  చెంపలు నిమురుకుంటూ వెళ్లిపోయాడు లోకేష్ బాబు.
----------------

తాజా ఫోటోలు

Back to Top