అమరావతి: ఈ నెల 28వ తేదీ రాత్రి 9 గంటలకు ఒకే కారులో (చంద్ర) జ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ చౌదరి, కమ్మని సర్వే ల స్పెషలిస్ట్ మాజీ ఎంపీ లగడపాటి రాజ గోపాల్ చౌదరి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. అర్ధరాత్రి 12 గంటలదాకా వీరు చర్చలు జరిపారు. ఒక పత్రికకు (ఆంధ్ర జ్యోతి) 7 వేల కోట్లు దోచి పెట్టాడు బాబు అని ఆయన దగ్గర పని చేసిన మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కళ్లం పేర్కొన్న విషయం విధితమే. (ఈ రాధాకృష్ణ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. వీణావాణీల పేరిట ఏబీఎన్ ఛానల్ లో వసూలు చేసిన డబ్బును కాజేసాడని అని ఆ పిల్లల తండ్రి ఆటో డ్రైవర్ అయినా మురళి గౌడ్ వేమూరిపై కేసు కూడా పెట్టాడు. నీకు కమ్మ పిచ్చి ఎక్కువ రాధాకృష్ణ అని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్‌లో మోహన్ బాబు అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు) నేను కేటీఆర్‌ను కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకోండి, మీ టీఆర్ఎస్ గెలుస్తోంది..లేకపోతే ఓడిపోతుంది అని నచ్చ చెప్పాను , కానీ కేటీఆర్ టీడీపీ తో పొత్తును ఒప్పుకోలేదు. నేను చేసిన సర్వేలో తెలంగాణ లో టీఆర్ఎస్ ఓడిపోతుంది. కేవలం 25 -45 సీట్లు వస్తాయి. చంద్ర బాబు నాయకత్వంలోని మహా కూటమి 55 -75 స్థానాలు గెలిచి అధికారం లోకి వస్తుంది అని ఎన్నికలకు ముందు చెప్పాడు లగడపాటి చౌదరి. కానీ టీఆర్ఎస్‌కు 88 సీట్లు , టీడీపీకి కేవలం రెండు సీట్లు , కాంగ్రెస్‌కు 19 సీట్లు వచ్చాయి. అంత కమ్మ కమ్మగా ఉంటాయి చౌదరి సర్వేలు. రేపు ఏప్రిల్ లో జరగబోయే ఏపీ ఎన్నికలలో ఫ్యాన్(వైయస్ఆర్‌సీపీ)గాలి స్పీడ్‌గా వీస్తోంది. దాన్ని ఎలా అడ్డుకోవాలి అని కమ్మ కమ్మగా మంతనాలు జరిపారు అని తెలుస్తోంది. దొంగ సర్వేలతో , ఉత్తుత్తి కథనాలతో బాబును జాకీలు పెట్టి ఎలా లేపాలి అని చర్చలు జరిగి ఉంటాయి. ఈనాడు రామోజీ చౌదరి , (చంద్ర) జ్యోతి రాధాకృష్ణ చౌదరి , గరుడ పురాణం ఫేమ్ శివాజీ చౌదరి , ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి , టీవీ విశ్లేషకులు సి నరసింహ రావు చౌదరి , లక్ష్మి నారాయణ చౌదరి, లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ చౌదరి, ఏపీ 24 /7 సీఈవో వెంకట కృష్ణ చౌదరి , టీవీ5 ఎండీ బీఆర్ నాయుడు అంతా బాబు మీద ఉన్న కులాభిమానంతో ప్రత్యక్షంగా పరోక్షంగా బాబు కోసమే పని చేస్తారు. మీడియాకు కుల పిచ్చి , సీఎం మా వాడు.. అది మా పార్టీ అని పచ్చపాతంగా ఉంటున్నాయి అని నటుడు పోసాని ఊరికే అన్నాడా? ఈ కుల మేధావుల కుట్రలు కుతంత్రాలు ప్రజలు గ్రహించాలి.