సృష్టికర్తలు..జ్ఞానులు..మహా జ్ఞానులు..


తుపాన్‌ను కంట్రోల్‌ చేస్తా..సునామిని అరచేతులతో ఆపేస్తా..హైదరాబాద్‌ను కట్టించేశా..సత్య నాదేళ్లకు కంప్యూటర్‌ కంప్యూటర్‌  నేర్పించింది నేనే..   ఒక మాటలో చెప్పాలంటే అన్ని నేనే.. సర్వం నేనే..  సృష్టికర్తను నేనే.. ‘నా’ అనే అక్షరం  పెటేంట్‌ హక్కుగా భావించే నారా వారి  డైలాగులు  తెలుగు ప్రజలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నారు. దీనికి కొనసాగింపుగా  వచ్చిరాని  చిలక పలుకులతో  ఏపీ ప్రజలను తన హాస్యవదానాలతో తెలుగు ప్రజలను గుక్క తిప్పుకోనివ్వకుండా నవ్వించి నవ్వించి ఏడుపిస్తున్న నారా వారి రాకుమారుడు లోకేష్‌ బాబు కూడా పచ్చ కార్యకర్తలు జయహోలు పలుకుతున్నారు.మేము మాత్రం తక్కువ తిన్నామా అని కాబోలు ఎమ్మెల్యేలు,మంత్రులు కూడా నారా వారి పార్టీ  కథా చిత్రాన్ని ఏపీ ప్రజలకు చూపిస్తున్నారు. సృష్టికర్తలు.. బికాంలో ఫిజిక్స్‌ చేసిన జ్ఞానులు..వర్ధంతికి, జయంతికి తేడా తెలియని మహా జ్ఞానులు ఏలుబడిలో ఏపీ ప్రజలు తరిస్తున్నారు.సంభ్రమాశ్చర్యాలలో మునిగితేలుతున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా  టీడీపీ మంత్రి  ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్య పట్ల ప్రజలు ముక్కుమీద వ్రేలు వేసుకుంటున్నారు. జయంతికి,వర్ధంతికి తేడా తెలియకుండా ఏసు వర్ధంతి రోజున క్రిస్మస్‌ జరుపుకుంటారని  వ్యాఖ్యనించిన ఆ మంత్రి రత్నం.. అంతటితో అగకుండా మాజీ మంత్రి వీరారెడ్డి మృతి రోజు, ఏసు వర్ధంతి రోజు ఒకటేనని సెలవిచ్చారు. మంత్రి స్థాయిలో ఉన్న  వ్యక్తికి  ఆ మాత్రం పరిజ్ఞానం లేదా అంటూ బహిరంగంగానే ప్రజలు చర్చించకుంటున్నారు. ఎస్సీలు సక్రమంగా చదువుకోరు..పరిశ్రుభంగా ఉండరు.ప్రభుత్వాలు ఎంత ప్రోత్సహించినా మారరంటూ.. గతంలో కూడా  టీడీపీ నేతలు మాటలను ప్రజలు గుర్తుకుతెచ్చుకుంటున్నారు. బికాంలో ఫిజిక్స్‌ లాంటి ఆణిముత్యాలు..బుల్‌ బుల్‌ బాలయ్యలు.వర్ధంతులకు,జయంతులకు తేడా తెలియని లోకాది నారాయణులతో పచ్చ పార్టీ కళకళలాడిపోతోంది. ఈ మహా జ్ఞానులందరినీ పచ్చపార్టీ మహా ప్రసాదాలుగా కీర్తిస్తూ  అగ్రనేత అగ్రతాంబూలం ఇచ్చేశారు. ఎత్తుపీటపై కూర్చొన్న వీరంతా ప్రజలకు శనిలా దాపురించారు.

Back to Top