బాబాకర్షణ

చంద్రబాబు వింత పోకడలు ఇంకా మారనే లేదు, ఏ దేశమేగినా ఏదో ఒకటి నచ్చి అది అర్జెంట్ గా అమరావతిలోకి కావాలి అని అధికారులను ఆదేశించేస్తుంటారు చంద్రబాబు. షాపింగ్ మాల్ లో కనిపించినదల్లా కావాలని మారం చేసే పిల్లాడు గుర్తొస్తాడు అధికారులకు బాబును చూస్తే. ఇక మొన్నే బయలు దేరి వెళ్లిన మూడు దేశాల విదేశీయానంలో బాబును ఏమేమి ఆకర్షిస్తాయో అనుకుంటూ ఆధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూసారు. ఆయనకి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా బాగా నచ్చింది. కృష్ణా నది ఒడ్డున నిర్మించే మన అమొఘ అమరావతిలోనూ ఇలాంటిదొకటి కావాలోయ్ అన్నాడు పక్కనే ఉన్న అధికార గణంతో…వాళ్లు మాత్రం ఏం అనగలరు సిమ్ అలా అన్నాక..అవున్సార్..మనకూ కావాలి…కావాలి అన్నారు. ఇలాంటి ఆకర్షణీయమైనవి ఉంటేనే కదా అమరావతిని చూడ్డానికి బోలెడు మంది వస్తారు. పర్యాటక రంగంలో మనం ముందుకు దూసుకు పోవచ్చు అన్నాడు బాబు సంబరంగా. అప్పుడే ఆయనకు కృష్ణానది మధ్యలో బుర్జు నారఫా కళ్లముందు మెదిలింది. దాని పై అంతస్తులో నుంచి అమరావతి అంతా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. 

ఆ తర్వాత అక్కడే ఉన్న సముద్రలో నిర్మించిన అట్లాంటిస్ హోటల్, ఆక్వా వెంచర్ పార్క్ లను చూసాక చంద్రబాబు మరింతగా ముచ్చటపడిపోయారు. మన అమరావతికి మాత్రం ఏం తక్కువ. ఎంచక్కా కృష్ణ ఒడ్డున, విశాఖ తీరానా ఇలాంటివి అవలీలగా కట్టేయచ్చు కదటోయ్ పి.ఎ అన్నాడు తన జనాకర్షణ తెలివితేటలకు మురిసిపోతూ. ఎస్ సర్ అన్నారు అధికారులు. ఇక దుబాయ్ ఎయిర్ పోర్టు చూడగానే మరో కోరిక కలిగింది బాబు గారికి. అమరావతి నుంచి డైరెక్ట్ గా దుబాయ్ కి అలాగే కాబోయే మన స్మార్ట్ సిటీలన్నిటి నుంచి దుబాయ్ కి ఫ్లైట్లు ఉండాలోయి. ఆ పని మీదుండండి అని ఆదేశించాడు. గొర్రెల్లా తలూపుతూ బాబు వెనకే నడిచారు అధికారగణం. బాబు చుట్టూ చూస్తున్నకొద్దీ వారికి బిపి పెరిగిపోతోంది. ఎక్కడ ఏది చూసి అమరావతికి తెమ్మంటాడో అని హడలిపోతున్నారు. ఖర్జూర చెట్లను చూసి మన ఇంటి వెనుక నాటిద్దామంటారో, లేక ప్రత్యేక పంటగా రాష్ట్రంలో పండిద్దామంటారో అని తెగ టెంక్షన్ పడిపోయారు. అదృష్టవశాత్తూ అలాంటిదేం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అధికారులకు చంద్రబాబుతో విదేశీయానం అంటేనే ప్రాణం మీదకొచ్చినట్టు ఉంటోందిట. అప్పుడెప్పుడో లండన్ ఐ చూసి అలాంటిదే అమరావతిలో పెడదాం అనేశారు. అయితే ఇలాంటివన్నీ ఇక్కడున్నంత సేపే అని తీరా  ఆంద్రాకి చేరిన తర్వాత అన్నీ మరిచిపోతారని అధికారులకు తెలుసు. కనుక బాబు ఏది కావాలన్నా ఒకె సర్, అలాగే సర్ అని తలలూపేస్తారు. 

చంద్రబాబు ఆనందంగా తేలిపోతూ అక్కడి నుండి బయలుదేరారు. చకచకా తను సాధించిన ఘనతను, సంపాదించిన వేలకోట్ల పెట్టుబడుల ఒప్పందాలను ప్రెస్ కి రిలీజ్ చేసారు. చంద్రబాబు సంగతి గత మూడున్నరేళ్లుగా గమనిస్తున్న మీడియా ఇక్కడ ఇలా హెడ్డింగ్ పెట్టింది ‘చంద్రబాబుకు మునుపటిలాగే పెట్టుబడులకు హ్యాండ్ ఇస్తామన్న విదేశీ సంస్థలు’. విదేశీ ఆకర్షణల్లో కొట్టుకుపోతున్న చంద్రబాబు ఈ న్యూస్ ని ఇంకా చూసారో లేదో…మరి!

తాజా ఫోటోలు

Back to Top