ఈ సైకిలింగ్ అంటే తెలుసా...!!


ఈ సైకిలింగ్ అనగానే ఇదేదో రీ సైకిలింగ్ కు కొత్త వర్షన్ అనో, ఈ వేస్టును పునర్వాడకం చేసే ప్రక్రియ అనో అనుకునేరు. అస్సలు కాదు ఈ సైకిలింగ్ అంటే ఈవిధమైన సైకిలింగ్ అని అర్థం. ఇంతకే ఏ సైకిలింగ్ గురించి ఈ సైకిలింగ్ అని చెబుతున్నామనుకుంటున్నారా? తెలుసుకోండి...
ఒకప్పుడు ఎన్నికలు పేపర్ బ్యాలెట్ పద్ధతిలో జరిగేవి. అందులో చెల్లేవి, చెల్లనివి, చిరిగినవి, తరిగినవి, అసలువి, నకిలీవి ఇలా రకరకాలు. ఇక ఓట్ల లెక్కింపు అయితే ఓ ప్రహసనం. ఏడుకొండల వాడి హుండీ లెక్కింపులాగే కొద్ది రోజుల పాటు ఎడతెగని క్లైమాక్స్ సస్పెన్స్. పోలింగ్ బూత్ ఓ యుద్ధరంగం, పోలింగ్ మొదలైన క్షణం నుంచి బాలెట్ బాక్సులు సురక్షితంగా చేరే వరకూ చెమటలు పట్టే టెంక్షన్. ఇప్పుడు ఆ బాదరబందీలేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరుగుతోంది. పేపర్ తో పనిలేదు. బటన్ నొక్కడం  నాయకుల భవిష్యత్ రాయడం. పూటలోనే ఫలితాలు ప్రపంచం ముందుకొచ్చేస్తున్నాయ్. అయితే కొందరికీ పద్ధతి సహించడం లేదు. అసలు ఎన్నికలంటేనే ’పచ్చ’ని పండుగ, ’కమ్మ’ని విందుగా భావించేవారికి ఈ   ఈ ఓటింగ్ నచ్చడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు చేసిన సైక్లింగ్ ఎలక్ట్రిక్ ఓటింగ్ సిస్టంలో కుదరడం లేదు మరి.
ఎవరూ కనిపెట్టందే కొత్త విషయాలు ఎలా పుడతాయని ఓ పెద్దాయన అన్నట్టు అధికారం కోసం కొత్త అడ్డదారులు తొక్కందే పీఠం ఎలా దక్కుతుందని నమ్మే నాయకుడొకరు కనిపెట్టిన విధానం ఇది. బాలెట్ ఓటింగ్ జరిగే సమయంలో సదరు నాయకుడికి చెందిన కార్యకర్త నకిలీ బ్యాలెట్ పేపర్ జేబులో పెట్టుకుని లోనికి వెళతాడు. అసలు బ్యాలెట్ పేపర్ తీసుకుని తన వద్ద ఉన్న దొంగ కాగితాన్ని బ్యాలెట్ బాక్సులో వేసి బయటకు వస్తాడు. ఇప్పుడా అసలు బ్యాలెట్ కాగితాన్ని కొనుకున్న ఓటరు చేతికిచ్చి, నమ్మకంగా ఓటు వేయించుకుని లోపలకు పంపిస్తారు. ఆ ఓటరు జేబులోని బ్యాలెట్ పేపర్ బాక్సులో వేస్తాడు, తన చేతికొచ్చిన పేపర్ ను బయటకు తెచ్చి అందిస్తాడు. ఇలా సైకిలింగ్ లా జరిగే రిగ్గింగుకు ఆద్యుడు, భోజ్యుడూ అయిన నాయకుడు మళ్లీ ఆరోజులు రావాలంటూ కలలు కంటున్నాడు. మళ్లీ తమ సైక్లింగ్ సిద్ధాంతం లేకపోతే ఎన్నికల్లో తమ పని గల్లంతే అని తెగ మదన పడిపోతున్నాడు. మరి ఆ నాయకుడి కోరిక తీరునో లేదో? ఆ రిగ్గింగు ఆటలు సాగునో లేదో? 
 

తాజా వీడియోలు

Back to Top