స్పెషల్ స్టేటస్ రాకపోతే కొంపలంటుకుపోతాయా?

మొత్తానికి చంద్రబాబంటే చంద్రబాబే.
 • అందరూ చాణక్యుడి గురించి గొప్పగా చెప్తారు కానీ...చంద్రబాబు అంతకన్నా గొప్పోడని నా అభిప్రాయం.
 • ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాలంటే మమ్మల్ని గెలిపించండయ్యా అని అడిగి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు  14 నెలలుగా ప్రత్యేక  హోదా ఊసే ఎత్తలేదు. 
 • ప్రత్యేక హోదా సాధన కోసం  ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ  అక్కడ పార్లమెంటులోనూ...బయట హస్తిన వీధుల్లోనూ..ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగానూ  ఆందోళనలు చేస్తోంటే...చంద్రబాబు ఏమన్నారో తెలుసా.? 
 • ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు లేదన్నారు.
 • అంటే ప్రత్యేక హోదాని టిడిపి సాధించుకుంటోందేమో..అందుకే ఆయన అలా అన్నారేమో అని  చాలా మంది  అనుకున్నారు.
 • ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో గంటన్నర సేపు  చర్చించారు.
 • ప్రత్యేక హోదా సాధించేశారేమోనని మీడియా మిత్రులు ఆతృతగా చంద్రబాబును  ప్రశ్నిస్తే..చంద్రబాబు తనకే సాధ్యమైన ఓ నవ్వు విసిరారు.
 • చంద్రబాబు స్థానంలో ఇంకెవరు ఉన్నా  మీడియా ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలా అని కంగారు పడిపోయేవారు.
 • కానీ చంద్రబాబు మాత్రం ..తడబాటు పడకుండా ప్రత్యేక హోదా మనకి రాదంటూ చాలా కూల్ గా చెప్పారు.
 • అంతే కాదు..అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు ప్రత్యేక హోదా రాకపోతే కొంపలు అంటుకుపోతాయా ఏంటీ అని గడుసుగా నిలదీశారు.
 • చంద్రబాబు ప్రశ్నకు పాత్రికేయులు షాక్ తిన్నారు. ఏం సమాధానం చెప్పాలో వారికి అర్ధం కాలేదు. బుర్రలు గోక్కున్నారు. తలలు పట్టుకున్నారు. వారి దయనీయ పరిస్థితి చూసి చంద్రబాబుకే జాలేసింది.ఆయన జోక్యం చేసుకుని..అయినా కొంతమంది పని గట్టుకుని ప్రత్యేక హోదా అంటే అపర సంజీవని అన్నట్లు అందరినీ తప్పు దోవ పట్టించేశారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
 • అయినా మనం కేంద్రం మెడలు వంచ్చి...ఒత్తిడి పెంచి..ప్రత్యేక హోదా అడిగామనుకోండి...కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేస్తుంది. కానీ దాని వల్ల మనకి ఏ లాభమూ లేదు అని చంద్రబాబు నాయుడు తనకు మాత్రమే సాధ్యమైనంత గందరగోళంగా చెప్పుకొచ్చారు.
 • మీడియా ఫ్రెండ్స్ మళ్లీ షాక్ తిన్నారు.
 • చంద్రబాబు కు కోపం వచ్చింది.
 • ప్రతీ దానికీ అలా షాక్ అయిపోతారేంటయ్యా? అని ప్రశ్నించారు.
 • దానికి ఓ విలేకరి స్పందించి అది కాదు బాబుగారూ..మరి మనకి ప్రత్యేక హోదా రాకపోతే  కష్టం కాదా ? అని అడిగాడు.
 • చంద్రబాబు పగలబడి నవ్వేసి.."నువ్వు ఒఠ్టి అమాయకుడిలా ఉన్నావయ్యా..ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితేనేం దానికన్నా ఎక్కువ నిధులు ఇస్తామంటున్నారు మనకేంటయ్యా నష్టం" అని  ప్రశ్నించారు.
 • దానికి మరో జర్నలిస్టు కల్పించుకుని " అది సరే కానీ.. స్పెషల్ స్టేటస్సే ఇవ్వలేమని చెప్పిన వాళ్లు అంతకన్నా ఎక్కువ నిథులు ఎందుకు ఇస్తారు? ఎలా ఇస్తారు? అని నిలదీశాడు.
 • చంద్రబాబు వినపడనట్లు పోజు పెట్టి " వాట్ యామై సేయింగ్... ప్రత్యేక హోదా కన్నా కేంద్రం ఎక్కువ ఇస్తానంటోంది. మనకి నష్టం ఏముంది? కోడలు మగబిడ్డను కంటానంటే..అత్త వద్దని అంటుందా ఏంటి? అని  ప్రశ్నించారు చంద్రబాబు.
 • అంటే మనకిక ప్రత్యేక హోదా లేదన్న మాట అని మరి కొందరు ఏపీ జర్నలిస్టులు బెంగగా అడిగారు.
 • చంద్రబాబు  వారి వంక ఆప్యాయంగా చూసి " వాట్ యామై సేయింగ్...ప్రత్యేక హోదా ఒక్క దానితోనే మనకి ఒరిగేదేమీ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని వారంటున్నారు. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు. మధ్యలో నీకేంటయ్యా నొప్పి  అని చంద్రబాబు అడిగారు.
 • అంటే ప్రత్యేక హోదా వద్దని మీరు అంగీకరించేశారా అని విలేకరులంతా కలిసి మూకుమ్మడిగా నిలదీశారు.
 • చంద్రబాబు  చాలా సహనంగా " వాట్ యామై సేయింగ్..అంటూండగానే విలేకరులంతా దండం పెట్టి అక్కడి నుంచి తమ తమ ఆఫీసులకు వెళ్లిపోయారు.
 • చంద్రబాబు తనలో తాను మురిపెంగా నవ్వుకుని వాట్ యామై సేయింగ్  అనుకుంటూ నవ్వుకున్నారు.
-కవికాకి

తాజా వీడియోలు

Back to Top