ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సమావేశం చంద్రబాబు హాజరయ్యాడు.``మా నిబంధనల మేరకే మీరు పనిచేస్తున్నారా?``అడిగాడు బ్యాంకు ప్రతినిధి``కట్టె కొట్టె తెచ్చె``అన్నాడు బాబు``ఇదేం భాష?`` అడిగాడు ప్రతినిధి అయోమయంగా ``మా సార్ ఎక్కువ మాట్లాడరు అంతా చేతలే, పొడి అక్షరాల్లోనే పొడుగాటి అర్థముంటుంది. కట్టె కొట్టె తెచ్చే అంటే రామాయణం కాదు. రైతుల బాధాయణం. రైతుల్ని కట్టేసి, కొట్టి మరీ మీ కాళ్ళ ముందు తెచ్చి పడేస్తామని అంటున్నాడు``విడమరచి చెప్పాడు సెక్రటరీ.``గుడ్ జాబ్, పరిశ్రమల సంగతేమిటి?``అడిగాడు ప్రతినిధి``మూత, కోత, రాత, వాత``చెప్పాడు బాబు``పరిశ్రమల్ని మూయించి, జీతాల్ని కోయించి కార్మికుల తలరాతలు మారుస్తానంటున్నాడు. ఎదురు తిరిగిన వాళ్ళకి వాతలు పెట్టిస్తానంటున్నాడు`` చెప్పాడు సెక్రటరీ.``సూటు,బూటు,హ్యటు``అన్నాడు బాబు ``సూటు,బూటేసుకుని వచ్చే వాళ్ళకే హ్యాట్సప్ అంటున్నాడు``<strong>``కర్ర,గొర్రె,బర్రె``</strong>`` ప్రజలు గొర్రెలు, వాళ్ళని కర్రలతో తన్నాలి.పాలిచ్చే వరకే బర్రకు విలువ. ఓటేసే వరకే ఓటరుకు విలువ``బ్యాంకు ప్రతినిధి ఆనందంతో పొంగిపోయాడు.``అన్నం,సున్నం,కన్నం``అన్నాడు బాబు``అన్నం పెట్టే రైతుకి సున్నం పెట్టి,వ్యవసాయానికి కన్నం వేస్తానంటున్నారు``వివరించాడు సెక్రటరీ.``జీతం,గీతం,పైత్యం``అన్నాడు బాబు``నెలా నెలా జీతం తీసుకుంటూ గీతాలు పాడుకుంటూ వున్న ఉద్యోగులకు పైత్యం కక్కిస్తానంటున్నాడు``<strong>``ఎలుక,ఏనుగు,పీనుగు``</strong>``ఎలుకగా ప్రజల్లో ప్రవెశించి, ఏనుగుగా మారి జనాన్ని పీనుగుల్ని చేస్తానంటున్నాడు````మేము కోరుకుంటున్నది ఇదే,మీరు అప్పులు ఎక్కువ తీసుకుని వడ్డీలు కడుతూ వుంటేనే మా బ్యాంకు నడిచేది``<strong>``బ్యాంకు,ట్యాంక్,ర్యాంక్``</strong>``మీ బ్యాంకుకి యుద్ధ ట్యాంకులాగా పనిచేసి ర్యాంక్ సంపాదించుకుంటాడట``బాబుకి వెంటనే టాప్ ర్యాంక్ ఇచ్చారు.