కంచెలేని మంచి చంద్రబాబూ...


ఆడపిల్లల రక్షణ కోసం ర్యాలీ మీరే తీయాలి...

ఎందుకంటే జిల్లాకు 100 తక్కువ కాకుండా ఆడపిల్లలపై వేధింపులు జరుగుతున్నాయి గనుక...
అమ్మాయిల భద్రత గురించి మీరే మాట్లాడాలి...
ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు, మంత్రులూ మహిళా అధికారులపై నడిరోడ్డుమీద దాడి చేస్తారు కనుక..

మహిళల గౌరవాన్ని మీరే కాపాడాలి...

ఎందుకంటే ‘కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా’ అంటూ తమరు... ‘ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి...కడుపైనా చేయాలి’ అంటూ తమరి వియ్యంకుడు గారూ  స్త్రీలను కించపరుస్తూనే ఉంటారు గనుక.

మీ పాలనలో ...
ఓ దళిత మహిళ తన భూమి కోసం పోరాడితే నడివీధిలో వివస్త్ర అయ్యింది.
ఓ అధికారిణి తన ఉద్యోగ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించబోతే దాడులకు గురైంది.
స్వయంగా స్పీకర్ గారి కోడలే గృహహింస వేధింపులు ఎదుర్కొంటున్నానంటూ రోడ్డెక్కింది.
టిడిపిలో ఎమ్మెల్యేలు, మంత్రులపై మహిళపై వేధింపుల కేసులు పుట్టలు పుట్టలుగా పెండింగ్ లో ఉన్నాయి. 
నాలుగేళ్లుగా స్త్రీలపై అత్యాచారాల కేసులు వేలల్లో పెరుగుతున్నాయి. 
మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, వేధింపులపై నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అంటాయి మహిళా సంఘాలు...
బాధితులకు న్యాయం జరగాలి, నేరస్థులకు శిక్ష పడాలి అని డిమాండ్ చేస్తాయి ప్రజా సంఘాలు...
కానీ మీరు అవేమీ చేయరు...
చేతిలో కొవ్వొత్తి పట్టుకుని ర్యాలీ చేస్తారు....
అఘాయిత్యాలు జరక్కూడదని చాటింపు వేస్తానంటారు..
సంఘటనలు జరిగే చోట మహిళలే తిరగబడాలని సందేశాలిస్తారు...
ఆట్టే మాట్టాడితే మరోసారి 30 కోట్లతో ఎసి హాల్లో, పరుపుల మీదకూర్చుని దీక్ష చేస్తానంటారు...
అంతేకానీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పరు...న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వరు...
మరోసారి ఇలాంటి దుర్ఘటనలు జరగవని ధైర్యం కలిగించరు...మహిళల రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోరు...
అంతేలెండి...ఇది మీకు అలవాటేగా మరుగుదొడ్ల నిర్మాణం సరిగ్గా జరగడం లేదని నివేదికలొస్తే చర్యలు తీసుకోవాల్సింది పోయి కలెక్టరేటు ముందు ధర్నా చేస్తా అన్నారు.
శ్రీకాకుళంలో అన్నిటికంటే తక్కవ మౌలిక వసతులు ఉన్నాయని రిపోర్టు వస్తే ఆ జిల్లా అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సింది పోయి అక్కడకెళ్లి అధికారుల్లో చలనం కోసం దీక్ష చేస్తానన్నారు. 
అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు మీ కింది అధికారులను సరిగ్గా పని చేయమని చెప్పే సత్తా లేకుండా ఉన్నారన్నమాట...
40 ఏళ్ల మీ రాజకీయ అనుభం, 13ఏళ్ల మీ ముఖ్యమంత్రి చాతుర్యం ఏమీ చేయలేని చేతకానితనాన్నే ఇచ్చాయన్నమాట...
పరిపాలనా వైఫల్యాలు కప్పి పుచ్చుకునేందుకు నాటకాలు ఆడటం తప్ప, మహిళలపై జరిగే అఘాయిత్యాల నియంత్రణకు, నివారణ చర్యలేమీ తీసుకోలేరన్నమాట...
మహిళా భద్రత విషయంలో చేతులెత్తేసి, క్యాండిల్ ర్యాలీ, చైతన్యయాత్ర జరిపి మీరు చేతులు దులుపుకోబోతున్నారన్నమాట...!!!
బుద్ధుడే కాదు, ఏ ప్రబుద్ధుడూ మెచ్చుకోని మీ మహా చైతన్య ర్యాలీ కీచకులకు గొడుగు, బాధితులకు చెడుగు.. 
 
Back to Top