కాదంటే ఔననిలే..


ఉండవల్లిలో పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం జరిగింది. ప్రజలు, ప్రతిపక్షాలూ నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా పట్టించుకోని శాంతిభద్రతల గురించి నేడు బాబుగారు ఉన్నపళాన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. చిత్రమేంటంటే ఎపి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఇన్నాళ్లుగా ఎండగడుతూ వస్తూన్నటిడిపి పాలనలోని ఆర్థిక, సాంఘీక నేరాలపై నోరెత్తని బాబు ఇప్పుడు వాటిపైనే చర్యలకు పూనుకున్నారు. ఏ సమస్యలనైతే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఎత్తి చూపారో వాటి పై నిర్ణయాలు తీసుకున్నారు. ఏనాడూ తమ తప్పుల్ని ఒప్పుకోని బాబు, శాంతిభద్రతల సమావేశం లో తీసుకున్న నిర్ణయాలను చూస్తే ఉన్న నిజాన్ని ఒప్పుకున్నట్టే అయ్యింది. 
రాష్ట్రంలో మద్యం సిండికేట్లు అంటే అవెక్కడ అన్నారు? ప్రజాదర్బారులో మాత్రం గొలుసు దుకాణాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేసారు. 
విద్యా సంస్థల్లో విపరీతాల గురించి ఆందోళన చేస్తే అదంతా విద్యార్థుల ప్రేమ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు అన్నారు. అధికారులతో మాత్రం ఈవ్ టీజింగ్ పై దృష్టి సారించమన్నారు.
ఇసుక మాఫియా రెచ్చిపోతోందంటే అవకాశమే లేదన్నారు సమావేశంలో ఇసుక రేవులను గుప్పెట్లో పెట్టుకున్న వారిపై చర్యలు తీసుకోమని తాఖీదులిచ్చారు.
దర్యాప్తు సంస్థల అసమర్థత గురించి విమర్శిస్తే అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయన్నారు, ఇప్పుడు విచారణలు మొక్కుబడిలా సాగుతున్నాయని ఆగ్రహిస్తున్నారు.
ఎస్సీ ఎస్టీలపై దాడులు చేస్తున్నారంటే, మా ప్రభుత్వంలో వారికి ఉన్నత స్థానం ఇచ్చామని మభ్యపెట్టారు, నేడు ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసుల్లో శిక్షలు పెంచాలంటున్నారు.
మహిళలు, పిల్లల అక్రమ రవాణా జరుగుతోందంటే పట్టించుకోలేదు, నేడు వారి కోసం పదిశాఖలను సమన్వయం చేసి కార్యాచరణ ఏర్పాటు చేస్తామంటున్నారు. 
టిడిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో నేరాల స్థాయి పెరగడం, నేరస్థులకు రాజకీయ అండదండలు పెరగడం గురించి జిల్లాల ఎస్సీలు, ఉన్నతాధికారులు నివేదికలు ఇచ్చారో లేదో తెలియదు కానీ తన పాలనలో రాష్ట్రం భద్రంగా మాత్రం లేదని చంద్రబాబుకు అర్థం అయినట్టే ఉంది. 
 
Back to Top