టీటీడీ ఛైర్మ‌న్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్ర‌మాణా స్వీకారం

 

తిరుమల: టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ‌ స్వీకారం చేశారు.ఈవో అనిల్‌కుమార్‌  సింఘాల్‌ గరుడ ఆళ్వార్‌ సన్నిధిలో ప్రమాణస్వీకారం చేయించారు. శనివారం ఉదయం కాలినడకన తిరుమలకు  చేరుకున్న  వైవీ సుబ్బారెడ్డి  శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన ముఖ్య‌మంత్రి  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి  కృతజ్ఞతలను తెలియజేశారు. ప్ర‌మాణాస్వీకార కార్య‌క్ర‌మంలో  ఎంపీ విజయసాయిరెడ్డి,ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,డిప్యూటీ సీఎం నారాయణ స్వామి,మంత్రి సురేష్,మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి,శ్రీనివాసులు,మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి,రౌతు సూర్యప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top