డాలర్‌ శేషాద్రి మృతి పట్ల వైవీ సుబ్బారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

తిరుపతి:  డాలర్‌ శేషాద్రి మరణం తీరని లోటని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి సేవలు మరువలేనివన్నారు. ఆయన మరణం పట్ల వైవీ సుబ్బారెడ్డి సంతాపం తెలిపారు. శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారన్నారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారన్నారు. ఆయన మరణ వార్త తానను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నానని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
 
 

Back to Top