విశాఖ: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పదిమందికి అన్నం పెట్టే వ్యక్తి అని, చంద్రబాబు ప్రజలను మోసం చేసి అన్నం పెట్టినవారికే కన్నాలు వేసే వ్యక్తి అంటూ వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అభివర్ణించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై చంద్రబాబు విషం చిమ్ముతున్నారు. ప్రజలకు మేలు జరిగితే సహించలేని వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాక్ట్ పై వైయస్ జగన్ పేదల భూములు లాక్కుంటారని, ఆ భూములకు రక్షణ లేదని పచ్చమీడియా సహకారంతో ప్రజల మనస్సులలో విషబీజాలు నాటుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు మేలు జరుగుతుంటే కడుపుమంటతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నాడని కొండా రాజీవ్ గాంధీ మండిపడ్డారు. ఇది చంద్రబాబు డిఎన్ ఏలోనే ఉందన్నారు. చంద్రబాబు తిరుపతి రైల్వేస్టేషన్ లో పిక్ పాకెట్ చేసే స్దాయినుంచి ఎన్టీఆర్ నుంచి టిడిపిని, సైకిల్ గుర్తును, నిధులను.. మోహన్ బాబు నుంచి హెరిటేజ్ ను లాక్కున్నాడని ఆరోపించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి అసెంబ్లీ సాక్షిగా టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మాట్లాడిన మాటలు నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ రోజు చంద్రబాబు దగ్గరనుంచి టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అసెంబ్లీ లో లేరని టీడీపీ సభ్యులు గజిని లుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు దోపిడీదారు...భూముల కబ్జాలకు పాల్పడ్డారు.ల్యాండ్ పూలింగ్ లో స్కామ్ లకు పాల్పడ్డారు.ఈ చట్టం వల్ల చంద్రబాబు ఆటలు సాగవునేది భయం. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకి దమ్ముంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచిదికాదని నరేంద్రమోదితో మాట్లాడించగలరా అని నిలదీశారు. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తాం అని నరేంద్ర మోది తో చెప్పించగలరా సవాలు చేశారు. టీడీపీ, జనసేన మ్యానిఫెస్టో ను ముట్టుకునేందుకు కూడా బీజేపీ ఇష్టపడలేదు. అసెంబ్లీ లో చర్చ జరిగినప్పుడు టీడీపీ నేతలు ఎక్కడ ఉన్నారు..గుడ్డి గుఱ్ఱానికి పళ్ళు తోముతున్నారా అని ప్రశ్నించారు. టీడీపీ కళ్ళకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ నల్ల చట్టంగా ఎందుకు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ సీపీకి చెందిన వాళ్ళు చిరంజీవిని ఎవ్వరూ కూడా అవమానించలేదని కొండా రాజీవ్ గాంధీ పేర్కొన్నారు.