విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ఇవాళ సేవ్ ఉమెన్- సేవ్ ఆంధ్రా నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం నేతలు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తున్నారు. విజయవాడలో.. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరుదు కళ్యాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. కృష్ణాజిల్లా లో.. సేవ్ ఉమెన్-సేవ్ ఆంధ్రా నినాదాలతో వైయస్ఆర్‌సీపీ మహిళా నేతల తమ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ మచిలీపట్నం లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు వైయస్ఆర్‌సీపీ మహిళలు. దీనిలో భాగంగా మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ రాష్ట్రం లో మహిళలపై, వృద్ధులపై, బాలికపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎవ్వరూ మమల్ని ప్రశ్నించకూడదు అని దాడులకు తెగబడుతున్నారు, పిల్లిని గదిలో పెట్టి దాడి చేస్తే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో టీడీపీకి అదే గతి పడుతుంది. రాష్ట్రంలో మహిళా హోమ్ మినిస్టర్ గా ఉన్నా ఆమె పసుపు పార్టీకి కార్యకర్తగానే వ్యవహరిస్తుంది తప్పా అధికారాన్ని ఎక్కడా మహిళ ల పక్షాన్న చూపించడం లేదు’ అని మండిపడ్డారు. విశాఖలో.. మహిళలపై జరుగుతున్న హత్యలు హత్యాచారాలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్ఆర్‌సీపీ మహిళా నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు మహిళ నేతలు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.రాష్ట్రంలో మహిళలకు చిన్న పిల్లలకు రక్షణ కరువైంది.కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేసారు. హోం మంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. గత ముఖ్యమంత్రి జగన్ మహిళల రక్షణకు పెద్దపీట వేశారు.దిశ చట్టాన్ని అమలు చేసి మహిళలకు భద్రత కల్పించారు’ అని వైయస్ఆర్‌సీపీ మహిళా నేతలు స్పష్టం చేశారు. అనంతపురంలో.. అనంతపురంలో చంద్రబాబు సర్కార్ పై మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలక భద్రత కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలు నశించాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు మహిళల ద్రోహి అంటూ నిరసన చేపట్టారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై ఆగని అఘాయిత్యాలపై అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. బాపట్లలో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యాలను అరికట్టడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అందుకు నిరసనగా పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు బాపట్ల పట్టణం లోని వైయస్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయం వద్ద నుండి బాబా సాహెబ్ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున పాల్గొన్నారు. సేవ్ ఉమెన్ - సేవ్ ఆంధ్రా అనే నినాదంతో మహిళలు కదం తొక్కారు. వైయస్ఆర్ జిల్లా.. వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కడప నగరంలో మహిళలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ మహిళల మానవహారం నిర్వహించి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలను నిరసిస్తూ ఆందోళన కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, హోంమంత్రి అనిత కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హోం మంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకు న్యాయం చేయలేకపోతున్నారని మండిపడ్డారు. ఆమెకు నిత్యం వైయస్ జగన్ ను తిట్టి చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసే పనిలో ఉన్నారని మహిళా నేతలు విమర్శించారు. 32వేల మహిళలు ఇప్పుడు ఎక్కడున్నారని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. మహిళల మన, ప్రాణాలను కాపాడలేని హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా : మహిళలపై జరుగుతున్న దాడులు,అఘాయిత్యాలను అరికట్టాలని కోరుతూ వైయస్ఆర్ సిపి మహిళ విభాగం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగా గీతా, జిల్లా అధ్యక్షురాలు సుజాత, తదితరులు పాల్గొన్నారు. వంగా గీతా మాట్లాడుతూ..`మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చామని కూటమీ ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేయడం కరెక్ట్ కాదు. ఏడాది కాలంలో 57 వరకు చిన్నారులు..మహిళలపై అత్యాచారాలు జరిగాయి. మహిళలకు రక్షణ లేకపోతే వారి తల్లిదండ్రులు ఏమవ్వాలి. వైయస్ జగన్ పాలనలో మహిళలకు ఎంతో రక్షణ ఉండేది. మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. మహిళలకు గౌరవం,సంక్షేమాన్ని ఇచ్చారు. ఏడాదిగా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న దిశ చట్టాన్ని పార్లమెంటు లో పాస్ చేసి తేవాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు`అని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా : పాలకొల్లు లో మహిళల పై జరుగుతున్న అత్యాచారాలు ,అఘాయిత్యాలు,అక్రమ కేసులపై వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం నాయకురాళ్లు నిరసన గళం విప్పారు. ముదునూరి మురళి కృష్ణంరాజు పర్యవేక్షణ లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ కర్ర జయ సరిత, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ నర్సాపురం పార్లమెంట్ సమన్వయకర్త ఉమ బాల , నర్సాపురం మున్సిపల్ చైర్మన్ బర్రి వెంకట రమణ , జెడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి, జిల్లాలో వివిధ నియోజవర్గ మహిళా అధ్యక్షులు పాల్గొని అంబేద్కర్ విగ్రహం కి పాలాభిషేకం చేసి వినతి పత్రం అందజేశారు. చిత్తూరు జిల్లా.. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎంసీ విజయానందరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అంజలి రెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రి దేవి, హరిణి రెడ్డి, లలిత కుమారి, మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీని రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా.. మహిళలకు అండగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యాలను అరికట్టడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆనం అరుణమ్మ మండిపడ్డారు. అనంతరం వి.ఆర్.సి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి, వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ అరుణమ్మ మాట్లాడుతూ...రాష్ట్రంలో ఎక్కడ చూసిన మహిళలపై దౌర్జన్యాలు, అరాచకాలు నిత్యం జరుగుతున్న పరిస్థితి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి గ్రామాలలో ఏ మూల చూసిన మహిళలపై అత్యాచారాలు, హత్యలు మరియు వేధింపులు, కుటుంబాలపై దాడులు పెరిగిపోయాయి. ఇలాంటి సంఘటనలను వైయస్ఆర్‌సీపీ తరపున తీవ్ర ఖండిస్తూ, ఇకనైన ప్రభుత్వం ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా శాంతి భద్రతలు కాపాడాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, రాష్ట్రస్థాయి కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షురాలు, మహిళా నాయకురాలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా.. రాష్ట్రంలో మహిళలపై నిరంతరంగా జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ప్రతీకాత్మక మౌన ప్రదర్శన నిర్వహించింది. బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు పోలీసు వ్యవస్థను నియంత్రించడంలో విఫలమయ్యారని, బాధితులకు న్యాయం లభించకపోవడం బాధాకరమని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో ప్రభుత్వం కనీస స్పందన చూపడం లేదని ఆయన ఆరోపించారు. “ఈ మౌన ప్రదర్శన ద్వారా మహిళల మనోవేదనను, ఆవేదనను పాలకుల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం” అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, జిల్లా ఉప అధ్యక్షులు మెంటాడ పద్మావతి , ఎంపీపీ అంబటి నిర్మల శ్రీనివాస్ , జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షులు రౌతు శంకరరావు , జడ్పీటీసీ ప్రతినిధి ఎచ్చెర్ల శ్రీధర్ , మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ , రాష్ట్ర మహిళా కార్యదర్శి టి. కామేశ్వరి , నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మూకళ్ళ సుగుణ , మాజీ ఏఎంసీ చైర్మన్ మూకళ్ళ తాతబాబు , మాజీ ఎంపీపీ అంబటి శ్రీనివాస్ , బొడ్డేపల్లి అజంతా, సుగుణ రెడ్డి , మహిళ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా.. విజయనగరం పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గదుల సత్యలత, కార్పొరేటర్లలు దుప్పాడ సునీత,సర్పంచ్ కెల్ల కృష్ణవేణి, పిన్నింటి కళావతి, ఆసపు సుజాత, ఆల్తి సత్య కుమారి, రేగాన రూపాదేవి వివిధ హోదాల్లో ఉన్న మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలపై అరాచకాలు , దాడులు జరుగుతున్నాయి అని మహిళా సంఘాలు శాంతియుతంగా ధర్నా చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా .. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో *మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యాలను అరికట్టడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అందుకు *నిరసనగా పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం లోని బాబా సాహెబ్ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి గారు,కురూపం ఎంపీపీ శెట్టి పద్మావతి, జడ్పీటీసీ గొర్ల సుజాత, జియమ్మవలస జడ్పీటీసీ శశికళ,వీరఘట్టం వైస్ ఎంపీపీ విజయకుమారి, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షురాలు - జడ్పీటీసీ జంపు కన్నతల్లి, పార్వతీపురం ఎంపీపీ మజ్జి శోభారాణి, పార్వతీపురం ఛైర్పపర్సన్ బోను గౌరీశ్వరి, వైస్ చైర్మన్ కొండపల్లి రుక్మిణి, స్టేట్ ఎస్సీ సెల్ నెంబర్ గండి భాగ్యవతి, పార్వతీపురం కౌన్సిలర్స్ లావణ్య, అనురాధ, లష్మిపార్వతి, ఇతర మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా.. వైయస్ఆర్‌సీపీ పార్టీ మహిళా విభాగము ఆధ్వర్యంలో అనకాపల్లి టౌన్ రింగ్ రోడ్డు పార్టీ కార్యాలయం నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకురాలు శోభ హైమావతి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బీసెట్టి సత్యవతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు, మండలం మహిళా అధ్యక్షులు, మహిళా విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా.. కూటమి ప్రభుత్వం లో రోజు రోజుకు మహిళల పై దాడులు అత్యాచారాలు ఎక్కువ అయ్యాయని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మండిపడ్డారు. పార్టీ పిలుపు మేరకు కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు దగ్గర నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు మహిళలు నిరసన ర్యాలీ చేపట్టి.. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీదేవమ్మ మాట్లాడుతూ.. ఓ వైపు రాష్ట్రంలో అసాంఘిక శక్తులు.. మహిళలు, బాలికలపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరోవైపు మహిళల భద్రత, గౌరవం, అత్మాభిమానం అంటూ వైఫల్యాన్ని కప్పిపుచ్చేకునేందుకు యత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంతటా భీతావహ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని కట్టడి చేయడం చేతగాని చంద్రబాబు ప్రభుత్వం.. ఎవరో ఓ ప్రైవేటు వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీకి ఆపాదిస్తూ దుష్ప్రచారానికి తెగబడుతోంది. తమ ఏడాది పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కుట్రకు తెగిస్తోంది.రాష్ట్రంలో రోజు రోజుకూ దిగజారుతున్న మహిళల భద్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అన్నారు.బాలికలు, మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న అత్యాచార పర్వం యావత్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎంతగా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఏకంగా 188 మంది బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇందులో అత్యాచారం ఆపై హత్యకు గురైన వారు 15 మం ది ఉన్నారు. మరో తొమ్మిది మంది బాలికలు, మహిళలు అనుమానాస్పదంగా మృతిచెందారన్నారు. ఈ ర్యాలీలో కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆలూరు శశికళ , కర్నూల్ డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కార్పొరేటర్లు, మహిళ నాయకులు పాల్గొన్నారు...కూటమి ప్రభుత్వం లో రోజు రోజుకు మహిళల పై దాడులు అత్యాచారాలు ఎక్కువ అయ్యాయని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మండిపడ్డారు. పార్టీ పిలుపు మేరకు కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు దగ్గర నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు మహిళలు నిరసన ర్యాలీ చేపట్టి.. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీదేవమ్మ మాట్లాడుతూ.. ఓ వైపు రాష్ట్రంలో అసాంఘిక శక్తులు.. మహిళలు, బాలికలపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడుతున్నా, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. మరోవైపు మహిళల భద్రత, గౌరవం, అత్మాభిమానం అంటూ వైఫల్యాన్ని కప్పిపుచ్చేకునేందుకు యత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంతటా భీతావహ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని కట్టడి చేయడం చేతగాని చంద్రబాబు ప్రభుత్వం.. ఎవరో ఓ ప్రైవేటు వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీకి ఆపాదిస్తూ దుష్ప్రచారానికి తెగబడుతోంది. తమ ఏడాది పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కుట్రకు తెగిస్తోంది.రాష్ట్రంలో రోజు రోజుకూ దిగజారుతున్న మహిళల భద్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అన్నారు.బాలికలు, మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న అత్యాచార పర్వం యావత్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎంతగా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు ఏకంగా 188 మంది బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇందులో అత్యాచారం ఆపై హత్యకు గురైన వారు 15 మం ది ఉన్నారు. మరో తొమ్మిది మంది బాలికలు, మహిళలు అనుమానాస్పదంగా మృతిచెందారన్నారు. ఈ ర్యాలీలో కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆలూరు శశికళ , కర్నూల్ డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కార్పొరేటర్లు, మహిళ నాయకులు పాల్గొన్నారు.