వ‌చ్చే ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేద్దాం

వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దేవినేని అవినాష్‌

విజ‌య‌వాడ‌: 2024 ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ న‌గ‌రంలో వైయ‌స్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్ చేద్దామ‌ని తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. బుధ‌వారం విజ‌య‌వాడ గురునానక్ కాలనీలో "మా నమ్మకం నువ్వే జగనన్న జే.సి.యస్ నమోదు శిబిరం" కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక విజ‌య‌వాడ న‌గ‌రం అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తుంద‌న్నారు. ఎన్న‌డు లేని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయ‌ని, ప్ర‌జ‌లు నేరుగా ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి పొందుతున్నార‌ని చెప్పారు. సంక్షేమ ప‌థ‌కాలే వైయ‌స్ఆర్‌సీపీని గెలిపిస్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వంపై ఎల్లో బ్యాచ్ చేస్తున్న అస‌త్య ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు. స‌మావేశంలో తూర్పు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు గుబ్బా చంద్రశేఖర్, వైయ‌స్ఆర్‌సీపీ నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్ , నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top