వైయస్‌ఆర్‌సీపీ గెలుపు ఖాయం

టీడీపీ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారు

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ గాజువాక అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి

విశాఖపట్నం: టీడీపీ అరాచకాలతో గాజువాక ప్రజలు విసిగిపోయారని వైయస్‌ఆర్‌సీపీ గాజువాక అభ్యర్థి  తిప్పల నాగిరెడ్డి అన్నారు.గాజువాక ప్రజలు ఈ సారి మార్పు కోరుకుంటున్నారన్నారు.స్థానికేతరుడైనా పవన్‌కల్యాణ్‌ గెలిచే పరిస్థితి లేదన్నారు..పవన్‌ కల్యాణ్‌కు  గాజువాకలో గెలుస్తాడనే నమ్మకం ఉంటే రెండు చోట్ల పోటి చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.స్థానికేతరులకు ఓటేస్తే సమస్యలు పట్టించుకోరన్నారు. గాజువాకలో వైయస్‌ఆర్‌సీపీ గెలుపు ఖాయమన్నారు. వైయస్‌ జగన్‌ను సీఎం చేయాలనే నిర్ణయంతో ప్రజలందరూ ఉన్నారన్నారు.
 

Back to Top