కలెక్టర్ పట్ల జేసీ ప్రవర్తించిన తీరు గర్హనీయం

 ప్రభాకర్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం

 తన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి

 అధికారులను బెదిరించడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారింది

 వైయ‌స్ఆర్‌సీపీ ఉరవకొండ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

ఉరవకొండ: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పట్ల ప్రవర్తించిన తీరు..మాట్లాడిన మాటలు చాలా క్షమించరానివని ఆయన తీరు అత్యంత గర్హనీయమని వైయ‌స్ఆర్‌సీపీ ఉరవకొండ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం వజ్రకరూరు మండలం బోడిసానిపల్లి తాండాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మండల కన్వీనర్ హనుమంతరెడ్డి,సర్పంచ్ మొనలిసా, ఎంపీపీ రమావత్ దేవి, వైస్ ఎంపీపీలు సుశీల రాణి, ప్యాపిలి సుంకమ్మ, ఎంపిటిసి ఫిరోజ్ బాను, నాయకులు సీపీ వీరన్న, వసికెరీ రమేష్,పిఏసీఎస్ చైర్మన్ సుధీర్ రెడ్డి,కడమకుంట డిష్ సురేష్, శశాంక్ రెడ్డి, నల్లబోతుల రాజు తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ పట్ల జేసీ ప్రవర్తించిన తీరు చాలా దుర్మార్గమని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు .జేసీ ప్రభాకర్ రెడ్డి తన మాటలను వెంటనే వెనక్కి తీసుకుని కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య బద్దంగా సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అయితే అక్కడ కూడా వాటికి పరిష్కారం రాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అంతేకాని అధికారులను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్నా ఆలోచనలతో బెదిరింపులకు ఇలా దిగడం దుర్మార్గం అన్నారు.జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి చాలా మంచిపేరు తెచ్చుకున్నారని విధి నిర్వహణలో ప్రజలకు మంచి సేవలు అందించి ప్రజల మన్ననలను పొందారన్నారు. 

పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అందరిని సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కలెక్టర్ సేవలు అందించారన్నారు.అటువంటి ఆమెపై ఇలా ప్రవర్తించడం సరైంది కాదన్నారు.జేసీ ప్రభాకర్ రెడ్డి మాదిరిగానే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులను బెరించడాన్ని అలవాటుగా మార్చుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలను ప్రజలు హర్షించరన్నారు.ప్రజల్లో టీడీపీ బలహీన పడడంతో వారు నిరాశ నిస్పృహలకు లోనై ఈ విదంగా రెచ్చిపోతున్నారని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. 

 గడప గడపకు కార్యక్రమంలో తహశీల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీఓ చంద్రమౌళీ, కిరణ్ కుమార్, రామానాయుడు, మున్నా,నెట్టికల్లు ,రాకెట్ల బాబు, బొగ్గు రవి,శాంతి,సామా నాయక్, తేజేశ్వర్ రెడ్డి,రమేష్,వీరంజి,వీరభద్ర గౌడ్, ఎంపిటిసి రామకృష్ణ, అమర్నాథ్, సర్పంచులు జగదీష్, సురేంద్ర,శివాజీ నాయక్, జేసిబి రామాంజనేయులు, సురేష్,బోడిసానిపల్లి తాండా నాయకులు లక్మా నాయక్, రామస్వామి నాయక్, బాలు నాయక్, భీమా నాయక్, మస్తాన్, వాలా నాయక్,వెంకటేష్ నాయక్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Back to Top