మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటాం

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.ర‌విచంద్ర‌

జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌

ఎన్టీఆర్ జిల్లా:  మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను ప్ర‌జాఉద్య‌మం ద్వారా అడ్డుకుంటామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.ర‌విచంద్ర అన్నారు. వైయస్ఆర్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేత‌లు కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ర‌విచంద్ర మాట్లాడుతూ.. పేద విద్యార్థుల‌కు వైద్య విద్య‌ను దూరం చేసేందుకు చంద్ర‌బాబు కుట్ర‌లు చేస్తున్నార‌ని  విమర్శించారు. పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను చేరువ చేయాలని, వైద్య కళాశాలల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను చంద్రబాబు కార్పొరేట్ వారికి కట్టబెట్టేందుకు  పీపీపీ విధానం తీసుకు వచ్చారని అన్నారు. వైద్య కళాశాలలపై ప్రజాభిప్రాయాన్ని కోటి సంతకాల రూపంలో సేకరించి గవర్నర్ కు అందచేసి, ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకోవాలని వైయ‌స్ఆర్ సీపీ అధినేత వైయ‌స్ జగన్  కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క మెడికల్ కళాశాలను తీసుకు రాలేకపోయారని, వైయ‌స్ జగన్ ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ తో గడచిన‌, మూడేళ్ళలో 17 మెడికల్ కళాశాలలను తీసుకు వచ్చారన్నారు.ఇందులో 5 వాటిని పూర్తి చేసి, మిగిలిన వాటిని వివిధ నిర్మాణ దశల్లో ఉంచారన్నారు. 

కోటి సంతకాల సేక‌ర‌ణ‌కు అపూర్వ స్పందన: తన్నీరు నాగేశ్వరరావు  

మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు మేర‌కు చేప‌ట్టిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో అపూర్వ స్పంద‌న వ‌స్తున్న‌ట్లు వైయస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. ఒక సంతకం,  పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుందన్న నమ్మకంతో  కోటి సంతకాల ఉద్యమంలో ప్ర‌జ‌లు భాగ‌స్వాముల‌వుతున్నార‌ని చెప్పారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు.

 కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఎం.పీ.పీ సంఘాం అధ్యక్షులు మార్కపూడి గాంధీ, రాష్ట్ర చేనేత విభాగ అధికార ప్రతినిధి పెంటి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి శివరాత్రి పృథ్వీరాజ్, జిల్లా విద్యార్థి విభాగ ప్రధాన కార్యదర్శి కటారపు నవీన్ , నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షులు బండి రంజిత్, జిల్లా పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి శ్రీలం మంగారావు, జిల్లా బూత్ కమిటీ విభాగ కార్యదర్శి గంగిపోగు రమేష్, జిల్లా కార్యదర్శి వేముల మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు, మండల రైతు విభాగ అధ్యక్షులు గూడపాటి శేషగిరిరావు, మండల కార్యదర్శి మందడపు జగదీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, పట్టణ యువజన విభాగ అధ్యక్షులు రామిని ఉపేందర్ రెడ్డి, గౌరవరం గ్రామ పార్టీ అధ్యక్షులు ఆదోరి కిషోర్ , ముత్యాల గ్రామ పార్టీ అధ్యక్షుడు మెండెం లింగేశ్వరరావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు అన్నబత్తుల శ్రీనివాసరావు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్నే అప్పారావు, తదితరులు పాల్గొన్నారు

Back to Top