ఎంపీ మిధున్‌రెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక అక్ర‌మ అరెస్టు

ఎంపీ అరెస్టును ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు 
 

తాడేప‌ల్లి: ఎంపీ మిధున్‌రెడ్డి కుటుంబాన్ని రాజ‌కీయంగా ఎదుర్కోలేక కూట‌మి ప్ర‌భుత్వం అక్ర‌మంగా అరెస్టు చేయించింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేత‌లు మండిప‌డ్డారు. అక్రమ మద్యం కేసులో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టును  విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టాలని మండిప‌డ్డారు. తప్పుడు కేసులు పెడుతున్న‌ వారందరి పైన భవిష్యత్తులో చట్టపరంగా ఎదుర్కొవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్, నాగేంద్ర సోషల్ మీడియా చిత్తూరు వింగ్ అధ్య‌క్షుడు వెంకట్ రెడ్డి, చంగల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వినోద్ కుమార్, గణేష్, మోహన్ యాదవ్ పుంగనూరు వాలంటరీ వింగ్ నాయ‌కులు చరణ్ తేజ్, మల్లికార్జున, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top