చిత్తూరు: వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే సునీల్ మండిపడ్డారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు నిరసనగా సుదుం మండలం బూరగమంద పంచాయతీ రామాపురంలోని అంబేద్కర్ విగ్రహనికి వైయస్ఆర్‌సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ..లిక్కర్ కేసు పూర్తిగా రాజకీయ కక్ష్యతో పెట్టిన కేసు మిధున్ రెడ్డిని అరెస్ట్ చేసి కూటమి ప్రభుత్వం ఆనందం పడతారో ఏమో కానీ...ఇది నిలబడే కేసు కాదన్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష్యతో పెట్టిన కేసు అన్నారు. తప్పుడు కేసులతో ఏ ఒక్క నాయకుడు భయపడే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సదుం మండల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు చింతల రెడ్డెప్ప రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఐటీ విభాగం అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి,వైస్ ఎంపీపీ ధనుంజయ రెడ్డి, రమణారెడ్డి, గిరిధర రెడ్డి, మోహన్ రెడ్డి, ఆనంద రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటస్వామి, మాజీ సర్పంచ్ సయ్యద్ బాషా, మండల కో ఆప్షన్ సభ్యులు ఇమ్రాన్, మైనార్టీ నాయకులు కమృద్దీన్, మస్తాన్,కాలేషా, అంజాద్,జిల్లా యువత ప్రధాన కార్యదర్శి బావాజీ, మండలం యువత అధ్యక్షులు మనోజ్,స్థానిక సర్పంచ్ వెంకటరమణ, ఎంపిటిసి మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.