అన్ని వ‌ర్గాలకు చంద్రబాబు మోసం

వైయ‌స్ఆర్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ 

దేవలభద్ర లో `బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ`

శ్రీ‌కాకుళం:  అధికారం కోసం అమ‌లుకు సాధ్యం కానీ హామీలిచ్చి చంద్ర‌బాబు అన్ని వ‌ర్గాల‌ను మోసం చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరాడ తిలక్ మండిప‌డ్డారు.  బుధవారం నందిగాం మండలం దేవలభద్ర గ్రామంలో మాజీ పిఎసిఎస్ అధ్యక్షుడు సర్లాన బైరాగి ఆధ్వర్యంలో బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ..వైయ‌స్ జ‌గ‌న్ రైతులు, మహిళల సంక్షేమానికి నిరంతరం పాటు పడ్డారని, చంద్రబాబు ఎన్నికల్లో అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేశారని అన్నారు. ఎన్నికలు జరిగి సుమారు ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజా సంక్షేమానికి సంబంధించిన పథకాలు ఏవి అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అబద్దపు హామీలపై తెలుగుదేశం నాయకులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన గ్రామంలో  ర్యాలీ నిర్వహించి చంద్రబాబు ఇచ్చిన హామీలు చేసిన మోసాలను ప్రజలకు వివరించారు.  కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి,  రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి యర్ర చక్రవర్తి, మండల పార్టీ అధ్యక్షులు తమిరి ఫాల్గుణ రావు, నాయకులు సర్లాన విలాసరాణి, కణితి నారాయణమూర్తి, పోలాకి మోహనరావు, తమిరి రాజు,అంబోడి విష్ణు, బొంగి హనుమంతరావు పొందల లచ్చయ్య, దీర్ఘాసి కృష్ణారావు, తమిరి దేవేందర్రావు, టి.రామారావు, జీరు లక్ష్మణ రెడ్డి,  బాలక ప్రభాకర్, అట్టాడ అప్పన్న, నడుపూరు రాంబాబు,పూడి నారాయణ, కురమాన మోహనరావు, సర్లాన రవి,సనపల శ్రీనివాసరావు,అప్పలనాయుడు నందిగాం మండలంలోని సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top