చెప్పేవి శ్రీరంగనీతులు! చేసేవన్నీ మోసాలే

చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడుదాం! 

వైయ‌స్ఆర్‌సీపీ వాసుప‌ల్లి గ‌ణేష్ ఫైర్‌

విశాఖ‌ 39వ వార్డులో `బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ`లో వాసుపల్లి 

విశాఖ‌: చంద్రబాబు చెప్పేవ‌న్నీ శ్రీ‌రంగ నీతులు, చేసేవి మోసాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ మండిప‌డ్డారు. విశాఖ ద‌క్షిణ‌ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వ‌ర్యంలో 39 వ వార్డు లో  వార్డు అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా  వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ.. చంద్రబాబు  స్వార్థపూరిత రాజకీయాలు, తన కొడుకు నారా లోకేష్ కు అందలం ఎక్కించడం కోసం ఎన్ని వెన్నుపోటు రాజకీయాలైనా చేయడానికి వెనుకాడరని దుయ్యబట్టారు. దక్షిణ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌సీపీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోందన్నారు. 18 నెలల కూటమి పాలన పూర్తిగా విఫలం అయిందని, ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారన్నారు. కేవలం అమరావతి కోసమే వేలకోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు చేస్తున్న అరాచక పాలన కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని అక్రమ కేసులు, లిక్కర్ స్కామ్ అంటూ కొత్త నాటకాన్ని తెరలేపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వాసుపల్లి వెల్లడించారు. నిజానికి కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపులు, మధ్య అక్రమంగా రవాణాతో కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ డైరెక్టర్ షబీర బేగం, సౌత్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు యాసిన్, వార్డు ఉపాధ్యక్షుడు గుండీల వెంకటరావు, కుర్ప మార్కెట్ చైర్మన్ తిట్టి కృష్ణ, జిల్లా మహిళా విభాగం నంబర్ మాలతి, వార్డు మహిళా అధ్యక్షురాలు మాధురి, వార్డు యూత్ అధ్యక్షుడు మైలపిల్లి ఆదినారాయణ, జిల్లా ఐటీ వింగ్ సెక్రటరీ గంగల రాజేష్, వార్డ్ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడు దూడ తాతారావు, వార్డు మైనార్టీ సెల్ అధ్యక్షుడు కమల్, వార్డు బీసీ సెల్ సభ్యుడు సత్య, సీనియర్ నాయకులు ముంగర రమేష్, ముంగర మధు, అత్తిలి కాంతారావు,  జుత్తుక  గిరిబాబు, బండి శ్రీను, చేపల అప్పారావు, గండి బోయిన శ్రీను త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top