మాజీ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ రెడ్డికి వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హిందూపురం పార్లమెంట్‌ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్‌ కుమార్‌ రెడ్డిని పార్టీ అధినేత‌ వైయస్‌ జగన్ ప‌రామ‌ర్శించారు. పోలీసుల అక్రమ కేసులో ర‌మేష్‌కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేయ‌డం ప‌ట్ల ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అక్రమ కేసుల వివరాలు, అరెస్ట్‌  గురించి ఆరా తీశారు. సీఎం చంద్రబాబు, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డిపై రాజకీయ విమర్శలు చేశారనే నెపంతో రమేష్‌ కుమార్‌ రెడ్డిపై లక్కిరెడ్డిపల్లె టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో భాగంగా కేసులు నమోదు చేయడం, భయబ్రాంతాలకు గురి చేయడం బాధాకరమని వైయస్‌ జగన్‌ అన్నారు. పోలీసుల అక్రమ కేసులు, అరెస్ట్‌లను తీవ్రంగా ఖండించారు. రమేష్‌ కుమార్ రెడ్డికి పార్టీ లీగల్‌ సెల్‌ పూర్తిగా అందుబాటులో ఉండి అవసరమైన న్యాయసహాయం అందిస్తుందని భరోసానిచ్చారు.

Back to Top