కోనేరు హంపి విజ‌యం..దేశానికే గ‌ర్వ‌కార‌ణం

చెస్ క్రీడాకారిణీకి వైయ‌స్ జగన్‌ శుభాకాంక్షలు
 

తాడేప‌ల్లి: మ‌హిళ‌ల‌ ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత్‌ నుంచి సెమీస్‌ చేరిన తొలి మహిళా గ్రాండ్‌ మాస్టర్‌గా కోనేరు హంపి (Koneru Humpy) చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. హంపి సాధించిన అరుదైన ఘనత  భారత్‌కు గర్వకారణమన్నారు. 
యువ క్రీడాకారులకు హంపి స్ఫూర్తిదాయకమని.. ఆమె భవిష్యత్తులోనూ ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేయాలనని వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు. 

Back to Top