హామీలు ఏమ‌య్యాయి బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త భూమ‌న అభిన‌య్‌

రీకాల్‌ చంద్రబాబు మేనిఫెస్టో మోసాలపై ఇంటింటి ప్ర‌చారం

తిరుప‌తి:  ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త భూమ‌న అభిన‌య్   చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు.  తిరుపతిలో నిర్వహించిన బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారంటీ, రీకాల్‌ చంద్రబాబు మేనిఫెస్టో మోసాలపై సోమ‌వారం ఆయన ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే సూప‌ర్ సిక్స్ హామీల‌తో పాటు 143 హామీలు నెర‌వేరుస్తాన‌న్న చంద్రబాబు మాట‌త‌ప్పార‌న్నారు. ఎండనక, వాననక, ధుమ్ముధూళిని లెక్కచేయకుండా నిత్యం రోడ్లపై పహారా కాస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న కానిస్టేబుళ్లు(పీసీ)లకు ఏడాదిన్నర కాలంగా టీఏ, డీఏలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. నిత్యం కానిస్టేబుల్‌ కొడుకునని చెప్పుకునే పవన్‌కళ్యాణ్‌కు వారి సమస్యలు చెవున పడడంలేదా? పడినా.. పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారా? అని అన్నారు. ఎన్నికలకు ముందు ఎవరికీ ఏ కష్టం రానివ్వనంటూ రోడ్లపై పడుకుని అరిచి చెప్పిన పవన్‌కళ్యాణ్‌ డిప్యూటీ సీఎం అయ్యాక దిష్టిబొమ్మలా మారారని విమర్శించారు. పొగాకు, మిర్చి, మామిడి రైతుల సమస్యలు పట్టించుకోరు, ప్రజల సమస్యలు పట్టించుకోరు, ఆఖరికి కానిస్టేబుల్‌ కొడుకుగా కానిస్టేబుళ్ల సమస్యలను పట్టించుకోకపోవడంలో నిర్లక్ష్యమేమిటో చెప్పాలన్నారు.  కార్య‌క్ర‌మంలో డీపీఆర్ మురళి, ఉచ్చురు వెంకటముని, ధనశేఖర్, గోపాల్ రెడ్డి, మనోహర్, వేంపల్లి రఘు, ఛాన్ బాషా, తేజ తదితరులు పాల్గొన్నారు.

Back to Top