మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తే స‌హించేది లేదు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వార్నింగ్‌

ప్రకాశం జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాలు దెబ్బ‌తీస్తే స‌హించేది లేద‌ని పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  ఒంగోలు పార్లమెంట్  ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చ‌రించారు. ఒంగోలు ప‌ట్ట‌ణంలోని రెడ్డి హాస్ట‌ల్ వ‌ద్ద ఉన్న‌ వైయ‌స్ఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టిన ఘ‌ట‌న‌ను చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరాధ దైవ‌మ‌న్నారు. పేదల ప్రజల కోసం ఎన్నో పథకాలు అమలు చేసిన నాయకుడి విగ్ర‌హానికి టీడీపీ జెండాలు క‌ట్టి అవమానించడం మంచి పద్ధతి కాద‌న్నారు. ఒంగోలు ఎమ్మెల్యే, ఆయన తమ్ముడికి మ‌ధ్య గొడవలు ఉంటే.. ఆ ఇద్ద‌రే చూసుకోవాల‌ని, మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. రెడ్డి హాస్టల్ వద్ద టిడిపి కార్యకర్తలు వ్యవహరించిన తీరు బాగోలేద‌ని, వారి పై కేసు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. మేము అలాగే వ్యహరిస్తే ...పరిస్థితి వేరేలా ఉంటుంద‌ని, అందుకే ఇలాంటి సంస్కృతి కి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని టీడీపీ నేత‌ల‌కు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు.
 

Back to Top