అధికారం ఎవరికి శాశ్వతం కాదు 

పోలింగ్‌ శాతం పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతను చాటిచెబుతోంది

ఓటమి భయంతో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు

అధికారులను దూషించడం సిగ్గుచేటు

పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి కోడెల తలుపులు ఎందుకు వేశారు

ఓడిపోతామనే భయంతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

అమరావతి: చంద్రబాబు ఓటమి భయంతో ఏదేదో మాట్లాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, చంద్రబాబు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు సాదృశ్యమని, ఓటమి భయంతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అధికారులను నిందించడం చంద్రబాబు నైజమని పేర్కొన్నారు. అమరావతిలో శుక్రవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

పోలింగ్‌ శాతం గతంలో కంటే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పెరుగుదల ప్రభుత్వ వ్యతిరేకతను చాటి చెబుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు స్పందించిన తీరు చూస్తే..దుష్ట పరిపాలన అంతం చేసి వైయస్‌ఆర్‌సీపీని గెలిపించబోతున్నారని మేం నమ్ముతున్నాం. చంద్రబాబు స్పందన చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. గత కొంత కాలంగా ఆయన ప్రవర్తన చూస్తే ఓటమి భయం ఉందని అర్థమవుతుంది. రోజు రోజుకు చంద్రబాబు విచిత్రంగా, చిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కమిషన్లను బెదిరిస్తున్నారని, ఐపీఎస్‌ ఆఫీసర్లను కొనుగోలు చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. బాధ్యత గల ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. సీఎస్‌ వెళ్లి డీజీపీని కలవడంలో కుట్రలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అధికారం కోల్పోతున్నారు కాబట్టి దూషిస్తున్నారు. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తున్నానని చెప్పే వ్యక్తి ఈవీఎంల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తాను ఓటు వేస్తే ఏ పార్టీకి పడిందో అని చంద్రబాబు అనడం సిగ్గుచేటు అన్నారు. ఈవీఎంలు పని చేయలేదని చంద్రబాబు అంటున్నారు. అవి పని చేయకపోతే ఇంత పర్సెంటేజీ ఎలా నమోదు అవుతుంది. చంద్రబాబు మాట్లాడుతున్న తీరుతో ఆయన ఓడిపోతున్నారని అర్థమవుతుంది. రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి.

23వ తేదీ తరువాత మంచిది చూసుకోని ప్రమాణ స్వీకారం చేస్తామనడం మంచిదే . కానీ ఏ పదవికో ఆయనే చెప్పాలి. కొంత మంది అధికారులను మీ చుట్టురా పెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలనుకున్న చంద్రబాబు కుట్ర భగ్నమైంది. పసుపు–కుంకుమ ఇస్తే మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేశారని అంటున్నారు. అలాంటప్పుడు ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఎందుకు భయపడుతున్నారు. ఓటమి, గెలుపులను సమానంగా తీసుకోవాలి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. మేం ఓటమి భయంతో అరాచకాలు సృష్టించామా? ఓటమి భయంతోనే చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని అధికారులను దూషిస్తున్నారు. ఇందంతా ఒక అరాచకం సృష్టించాలని చంద్రబాబు భావిస్తునారు. ఇది ధర్మం కాదు..చంద్రబాబు నిర్భయంగా ఉండాలి. జరగవాల్సింది జరిగి తీరుతుంది. కొన్ని చోట్ల టీడీపీ నేతలు ఈవీఎంలకు అడ్డుపడుతున్నారు0

అధికారం ఎవరికి శాశ్వతం కాదు..చంద్రబాబు తన అధికారం పోతుందని అరాచకం సృష్టిస్తున్నారు. రౌడీయిజం చేసింది టీడీపీ నేతలు. మా కార్యకర్తలు మరణించారు. హత్యకు గురయ్యారు. డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, మేరుగు నాగార్జున, పుష్పశ్రీవాణి, కాసు మహేష్‌రెడ్డిలపై దాడికి పాల్పడ్డారు. ఎక్కడైతే టీడీపీ బలహీనంగా ఉందని భావించారో అక్కడ అరాచకాలు సృష్టించారు, కోడెల శివప్రసాద్‌పై దాడి జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడు అలాంటి దాడులు చేయలేదు..చేయబోము కూడా. కోడెల ఒక క్రిమినల్‌ మైండ్‌ కలిగిన వ్యక్తి. ఆయనపై ఎన్నో కేసులు ఉన్నాయి. చంద్రబాబు సీఎం అ య్యాక కేసులను మాఫీ చేశారు. వైయస్‌ఆర్‌సీపీకి పెట్టని కోటగా ఉన్న గ్రామంలో కోడెల వెళ్లి కూర్చున్నారు. తలుపులు ఎందుకు వేశారు. క్యూలో నిలబడిన ఓటర్లు ఏమనుకుంటారు. మీరు ఏదో చేయబోతున్నారని ఓటర్లు ఆవేశానికి లోనయ్యారు. దీన్ని చిలువలు, పలువులు చేసి చూపిస్తున్నారు.

కోడెల తలుపులు వేయాల్సిన అవసరం ఏముంది. వైయస్‌ఆర్‌సీపీ మెజారిటీ తగ్గించాలని ప్రయత్నించారు కాబట్టే ప్రజలు తిరుగబడ్డారు. మేం ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగిన వ్యక్తులమని, మాకు అరాచకాలు చేయడం తెలియదు. మే 23వ తేదీన ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఈవీఎంలతోనే చంద్రబాబు గెలిచారు. ఇవాళ కొత్తగా వచ్చినవి కావు. మీరు గెలిస్తే ఈవీఎంలు బాగా పని చేశాయని, ఓడిపోతారంటే బాగా పని చేయనట్లా? చంద్రబాబు ఇవాళ సింగిల్‌గా ఎన్నికలకు వచ్చారు. గతంలో అన్నిసార్లు పొత్తుతో వెళ్లారు. నిన్న జరిగిన ఎన్నికల్లో ఎవరితోనూ మితృత్వం లేకుండా సింగిల్‌గా చంద్రబాబు పోటీ చేశారు. ఆ ఫలితాలు ఏంటో మే 23వ తేదీ బట్టబయలు కాబోతోంది. చంద్రబాబు మాటలకు అర్థం లేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆయనకు మీడియా అండ ఉందని ఏదేదో మాట్లాడుతున్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top