మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు

వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ బాబా స‌లామ్‌

అనంత‌పురం: ఎంపీ మిధున్ రెడ్డి అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజని వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ బాబా స‌లామ్ పేర్కొన్నారు. ఎంపీ మిధున్‌రెడ్డి అక్ర‌మ అరెస్టును ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు బాబా స‌లామ్ మాట్లాడుతూ.. `ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష్యతో పెట్టిన కేసు మిధున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆనందం పడతారో ఏమో  కానీ...ఇది నిలబడే కేసు కాదు.  కూటమి కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు.  నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నార‌ని ఫైర్ అయ్యారు.  నిజానికి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నో తప్పుడు కూటమి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయింది. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత  రావడంతో తప్పుడు కేసులు పెట్టడం మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్న ఇంతవరకు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం పైన దృష్టి పెట్టకుండా ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుల‌ను వేధించ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. త‌ప్పుడు కేసుల‌కు, అరెస్టుల‌కు భ‌య‌ప‌డేది లేదు` అని షేక్ బాబా సలామ్ ప్ర‌భుత్వాన్ని హెచ్చరించారు. 

Back to Top