తాడేపల్లి: ఏపీలో ఇసుక మొత్తం కూటమి నేతల కబ్జాలోకి వెళ్లిపోయిందని వైయస్ఆర్‌సీపీ ఆరోపించింది. పచ్చ నేతలు ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జాచేసి అక్రమంగా కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వైయస్ఆర్‌సీపీ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రంలో ఇసుక మొత్తం టీడీపీ నేతల కబ్జాలోకి వెళ్ళిపోయింది. ధరను అమాంతం పెంచేసి కోట్లలో దండుకుంటున్నారు. అయినా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోంది. ఇసుక, మద్యం వ్యాపారాలను కబ్జా చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏకంగా సివిల్ వర్క్స్, నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. పనులు తమకు అప్పగించి వెళ్లిపోవాలని హుకుం జారీచేస్తున్నారు. రాక్షస పాలనకు ఇది కదా నిదర్శనం.