పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి?

 వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు,  ఎంపీ నందిగాం సురేష్‌

అమరావతిలో కేవలం ఒక వర్గం మాత్రమే ఉండాలా?

అమరావతిలో చంద్రబాబు తన వారికే ప్రయోజనం చేకూర్చారు

అసైన్డ్‌ రైతుల పట్ల చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారు.

అమరావతిలో పేదలు ఉండడానికి వీలులేని కోర్టుకు వెళ్లారు.

అమరావతిలో అందరూ ఉండాలని వైయస్‌ జగన్‌ కోరుకుంటున్నారు

సీఎం వైయస్‌ జగన్‌ వచ్చాక విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహానికి స్థలం

పేదలంటే టీడీపీకి ఎందుకంత కడుపుమంట

తాడేపల్లి:  రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే తెలుగు దేశం పార్టీ నేతలకు అభ్యంతరం ఏంటని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నందిగాం సురేష్‌ ప్రశ్నించారు. మీరు రాజ భోగాలు అనుభవిస్తుంటే కనీసం పేదలకు ఇల్లు ఉండొద్దా అని నిలదీశారు. పేదలంటే టీడీపీకి ఎందుకంత కడుపుమంట అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క వర్గానికైనా న్యాయం చేశారా అని మండిపడ్డారు.తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నందిగాం సురేష్‌ శనివారం మీడియాతో మాట్లాడారు.
ఎంపీ నందిగాం సురేష్‌ ఏమన్నారంటే..

 టీడీపీ నేతల చెంప చెళ్లుమనిపించేలా హైకోర్టు తీర్పుః
నిన్న రాజధాని అమరావతిలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయిచండంపై హైకోర్టు తీర్పు పట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. అమరావతి ప్రాంతంలో 50వేల మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు తలంచితే.. దానికి ప్రతీచోటా అడ్డంకులు సృష్టిస్తూ.. అడ్డుతగులుతూ వచ్చిన టీడీపీ నేతల చెంప చెళ్లుమనిపించిన విధంగా హైకోర్టు తీర్పు ఉంది. 

పెత్తందార్ల నాయకుడిగానే చంద్రబాబుః
మొదట్నుంచి చంద్రబాబుకు పేదలంటే ఇష్టంలేదేమో.. అందుకనే, ఇక్కడ ఆయన పెత్తందార్ల నాయకుడుగానే పనిచేస్తున్నాడు. రాజధానికి అమరావతి పేరు పెట్టిన దగ్గర్నుంచి ఆ ప్రాంతంలో పేదలనే వాళ్లు ఉండకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారేమో.. కనుక, అదే భావంతో పేదలపై పగను ఆదినుంచి ప్రదర్శిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే అసైన్డ్‌ రైతులకు ప్లాట్‌లు కేటాయింపును శ్మశానస్థలాల్లో, వాగులు, వంకల్లో, పోరంబోకు భూముల్లో మాత్రమే ఇచ్చారు. చాలా విలువైన ప్రాంతాల్లో మాత్రం చంద్రబాబు సామాజికవర్గం వారికి ప్లాట్ల కేటాయింపు చేసుకున్నారు. తన సొంత సామాజికవర్గం వారు పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చే సమయంలో వాళ్లకు కొత్తవస్త్రాలు, పసుపు-కుంకుమ పెట్టి తీసుకుంటే.. అదే, అసైన్డ్‌ రైతుల దగ్గర భూముల్ని తీసుకునే సమయంలో మాత్రం చాలాచిన్నచూపు, చులకన భావంతో రేషన్‌దుకాణాల్లో కోటాబియ్యం ఇచ్చిన చందంగా వ్యవహరించారు. ఎందుకంటే, పేద రైతులు అసైన్డ్‌ భూముల్ని ఇవ్వకపోతే, బెదిరించి, దౌర్జన్యం చేసైనా ప్రభుత్వం లాక్కుంటుందని.. కనుక, మర్యాదగా మీ భూముల్ని ఇవ్వండంటూ అసైన్డ్‌ రైతుల పట్ల ఆనాడు చులకన చూపు చూశారు. దాంతో, కొందరు పేద రైతులు ధర వచ్చినకాడికి భూముల్ని తెగనమ్ముకుంటే, మరికొందరు మాత్రం ప్రభుత్వానికి అప్పగించి.. శ్మశానవాటికల్లో వారికి కేటాయించి ప్లాట్లను తీసుకున్నారు. 

ఆకాశమంత ఎత్తున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహంః 
అమరావతి ప్రాంతంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గారి విగ్రహం పెట్టే విషయంలో కూడా చంద్రబాబు పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. అమరావతి ప్రాంతంలో అంబేద్కర్‌ విగ్రహం పెడుతున్నానంటూ.. ఎక్కడ్నో మారుమూల పిచ్చి చెట్లు, కంపల్లో.. వరదొస్తే మనిషిలోతు మునిగిపోయే ప్రాంతంలో విగ్రహం పెడతానని చంద్రబాబు చెప్పాడు. అదే మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు మాత్రం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గారి విగ్రహం ఉండాల్సింది ఇక్కడ కాదు. ఆయన మన దేవుడు కాబట్టి విజయవాడ నగర నడిబొడ్డున ఉండాలంటూ.. వందల కోట్ల విలువైన భూమిని కేటాయించి ఆకాశమంత ఎత్తున 125 అడుగుల్లో అంబేద్కర్‌ గారి విగ్రహాన్ని పెడుతున్న పరిస్థితి ఉంది. 

పెత్తందార్ల రాజధానిగా మార్చాలకున్న బాబుః
అమరావతి ప్రాంతంలో పేదలు కూడా ఉండాలని.. రాజధాని అనేది ప్రజా రాజధానిగా ఉండాలని,  చంద్రబాబు ఆలోచన ప్రకారం రియల్‌ ఎస్టేట్‌ దందా చేసే రాజధాని కాదంటూ.. అందులో పేదల భాగస్వామ్యం ఉండాలని దాదాపు 50వేల మంది పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయింపునకు  శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్ గారు. దానికి టీడీపీ నేతలు, చంద్రబాబు రకరకాల అడ్డంకులు సృష్టించారు. న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. వారి పిటిషన్లలోని వాదనలేంటంటే... పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు..  రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంటే.. ఈ ప్రాంతం ఒక మురికి కూపంగా తయారవుతుందని పేర్కొన్నారు. రాజధాని అభివృద్ధికి పేదలంతా అవరోధంగా మారతారు కనుక వీళ్లకు ఇక్కడ ఇళ్ళ స్థలాలు ఇవ్వకూడదని టీడీపీ నేతలు కోర్టుకెక్కారు. అంటే, చంద్రబాబు అనుకున్న అమరావతి రాజధానిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉండకూడదని ఆయన బలమైన ఆలోచన కలిగి ఉన్నారనేది అర్థమైంది.  ప్రజారాజధాని అనేది మా ప్రభుత్వ ఆలోచనైతే.. పెత్తందార్లదే రాజధానిగా ఉండాలనేది చంద్రబాబు భావం. దీన్నిబట్టి బాబుకు, మా జగన్‌ గారి ఆలోచనల్లో వ్యత్యాసాన్ని అందరూ పరిశీలించాలని కోరుతున్నాను.

పేదలపై ‘బాబు’ప్రతీకారంః
పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చంద్రబాబు ఎందుకంత పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాడంటే, ఆయనకు 2019 ఎన్నికల్లో వీళ్లేవరూ ఓట్లు వేయకుండా ఓడించారని.. అందుకనే, పేదవర్గానికి సెంటు భూమి కూడా ఎక్కడా ఉండకూడదని.. ప్రభుత్వమూ ఇవ్వరాదని బాబు తన ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. తన దాయాది, తన బంధువుల్ని ఏర్పాటు చేసుకుని రైతుల ముసుగులో పేదలకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో పిటీషన్లను దాఖలు చేస్తున్నాడు ఈ చంద్రబాబు. ఈ విషయం రాష్ట్ర ప్రజలంతా తెలుసుకున్నారు కనుక బాబు తన పక్షపాత ఆలోచనను ఇప్పటికైనా మార్చుకోవాలని హితవు చెబుతున్నాను. 

బాబుది క్షమించరాని నేరంః
తరాలుగా పెత్తందార్ల పెత్తనానికి పేదలు ఊరి చివర్నే బతకాలనే కాలం ఏనాడో మారిపోయిందని చంద్రబాబు తెలుసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కాలనీలు ఈ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉండకూడదని, ఊరుచివర్లో ఉండాలనే చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనను పేద ప్రజలు అర్ధం చేసుకోవాలి. పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా చంద్రబాబు ఇంత నీచమైన ఆలోచనకు పూనుకోవడం క్షమించరాని నేరంగా పరిగణించాలి. పేదలపట్ల ఇంత వివక్షతతో నడుస్తున్న బాబు ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రంగా ప్రజలకు తెలిసిపోయింది. 

పేదలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకెళ్లిన టీడీపీః
ఎన్నో తరాల తర్వాత పెత్తందార్ల పోకడకు స్వస్తి పలికి పేదల రాజ్యానికి శ్రీకారం చుట్టిన మా నాయకుడు జగన్‌ గారి ఆలోచనను స్వాగతించకుండా.. సాక్షాత్తూ హైకోర్టు కూడా పేదల పక్షాన నిలిస్తే.. కళ్లు తెరవాల్సిన చంద్రబాబు తగుదునమ్మా.. అంటూ తన బినామీల్ని పంపి పేదలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో అప్పీల్‌ పిటిషన్‌ వేయించారు. దీన్నిబట్టి మనమంతా ఆలోచించాల్సిన విషయమేమంటే, చంద్రబాబు కోరుకున్నట్టు పెత్తందార్లతోనే రాజధాని ఉండాల్నా.. లేదంటే, పేదలతో పాటు అన్నివర్గాలుండే ప్రజా రాజధానిగా ఉండాల్నా..? అన్నది ప్రజలే తేల్చాలి.

పేదలకు చోటులేదనే హక్కు మీకెక్కడిది బాబూ..?ః
అమరావతి ప్రాంతంలో పెత్తందార్లు మినహా పేదలకు అక్కడ స్థానం లేదని చెప్పే హక్కు చంద్రబాబుకు గానీ, టీడీపీ నేతలెలకుగానీ ఎక్కడిది..? ఆ భూములు మీవా..?. రైతులు అమరావతి రాజధానికి భూములిచ్చినప్పుడు.. వాణిజ్య కేటగిరిలో వాళ్లకు ప్రభుత్వం ఎప్పుడో ప్లాట్లు కేటాయించింది. మిగులు భూములన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉంటే, ఆయా భూముల్లో పేదలకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే, మీకెందుకు అంత కడుపు మంట..? అని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు పశువులా కాకుండా ఇప్పటికైనా మనిషిగా పేదలపట్ల సానుకూలంగా ఆలోచించమని కోరుతున్నాను. అలా మారని పక్షంలో 2024 ఎన్నికల్లో ఇంతకుముందెన్నడూ ఎరుగని పరాభవం ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాను. 

పేదలంతా కలిసి బాబును తరిమికొట్టాలిః
పేదలకు అనుకూలంగా ఇచ్చిన హైకోర్టు తీర్పును స్వాగతించాల్సింది పోయి టీడీపీ నేతలు నిన్నట్నుంచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.  ‘మేం అధికారంలోకొస్తే అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్‌5 జోన్‌లో ఇచ్చిన భూములన్నింటినీ వెనక్కు తీసుకుని.. లబ్ధిదారులును తరిమి కొడతాం..’ అంటూ అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు. అంటే, టీడీపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు కూడా చంద్రబాబు కబంధహస్తాల్లో చిక్కుకుని ఆయనకు బానిసల్లా మాట్లాడుతున్నారన్నమాట. ఎటూ టీడీపీ అధికారంలోకి వచ్చేదీ లేదు అన్నది ఆ పార్టీలోని నాయకులు గుర్తెరగాలి. వచ్చే ఎన్నికల్లో కూడా పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా కలిసి బాబును తరిమికొడతారని ఆయనకు, ఆయన తాబేదార్లకు హెచ్చరిక చేస్తున్నాను. 

పేదవర్గాలంతా జగనన్న వెంటే..
చంద్రబాబుకు, మా జగన్‌ గారికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. పెత్తందార్ల ఆలోచనలకు సమాధి కడుతూ మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది ఆడబిడ్డలకు భూములు కొనుగోలు చేసి మరీ, ఇళ్లస్థలాలు పంపిణీ చేశారు. నేడు, జగనన్న కాలనీల్లో అన్నివర్గాల పేదలు ఉన్నారు. కనుకనే, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కుటుంబాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి వెంటనే నడుస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పరిపాలన చేసే నాయకుడిగా జగన్ గారే  ఉండాలని పేద ప్రజలంతా ఏక కంఠంతో కోరుకుంటున్నారు.   

Back to Top