జ్యోతిరావ్ పూలేకు వైయ‌స్ జగన్ నివాళి 

తాడేపల్లి: ప్రముఖ సామాజిక సంస్కర్త జ్యోతిరావ్‌ పూలే జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆయనకు నివాళులర్పించారు.  సమాజంలో సగభాగమైన స్త్రీలు అభివృద్ధి చెంద‌క‌పోతే దేశానికి పురోగతి అసాధ్యమని విశ్వసించిన జ్యోతిరావ్ పూలే.. నాడే మహిళా విద్యకు తొలి జ్యోతి వెలిగించారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు.. అనాథ శిశువుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించి, వితంతువుల పున‌ర్వివాహానికి మ‌ద్ద‌తుగా, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు వెన్నుదన్నుగా నిలిచారు అని గుర్తు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ ఖాతాలో వైయ‌స్ జగన్ ఓ ట్వీట్‌ చేశారు. 

Back to Top