ద‌త్త‌తండ్రిని సీఎం చేయాల‌ని.. ద‌త్త‌పుత్రుడి ఆరాటం

ఎంత‌మంది క‌లిసి వ‌చ్చినా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ఏమీ చేయ‌లేరు

స‌త్య‌సాయి జిల్లా వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షుడు శంక‌ర్ నారాయ‌ణ‌

స‌త్య‌సాయి జిల్లా: సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను సింగిల్‌గా ఎదుర్కొనే ద‌మ్ములేక ప్యాకేజీ స్టార్ ప‌వ‌న్‌ను చంద్ర‌బాబు పావుగా వాడుకుంటున్నాడ‌ని, ఎంత‌మంది క‌లిసి వ‌చ్చినా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఏమీ చేయ‌లేర‌ని స‌త్య‌సాయి జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడుతూ, శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబ‌ర్‌.1 పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తగదన్నారు. తమ ప్రచారం కోసం చంద్రబాబు కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురి ప్రాణాలను బలిగొన్నారన్నారు. ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకునే పవన్‌కల్యాణ్‌... ఈ రెండు ఘటనల్లోని బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించ లేదని శంక‌ర్ నారాయ‌ణ నిల‌దీశారు. పవన్‌కల్యాణ్‌ 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి చంద్రబాబుకు  ప్రయోజనం చేకూర్చారని, ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల్లో ద‌త్త‌తండ్రికి లబ్ధి కల్పించడానికి ద‌త్త‌పుత్రుడు తహతహ లాడుతున్నారన్నారు. చంద్రబాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల డ్రామాల‌ను ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌ని, ఎన్నిక‌ల్లో త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు. 

Back to Top