సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకి చెంపపెట్టు    

వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు

మాజీ ఎంపీ మార్గాని భరత్‌ స్పష్టీకరణ

రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌.

నిరసన పేరుతో దాడులకు తెగబడ్డ టీడీపీ నాయకులు

జర్నలిస్ట్‌ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఒక సాకు మాత్రమే 

మహిళల ముసుగులో టీడీపీ ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు 

ప్రశ్నిస్తున్న సాక్షి మీడియా గొంతు నొక్కే దుష్ప్రయత్నం

రాష్ట్రంలో టీడీపీ కూటమి కూటమి పాలన దారుణం

మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ధ్వజం

రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే అనుచరుడి హీన ప్రవర్తన

బాలికను నమ్మించి మోసగించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి అనుచరుడు

8వ నెల గర్భంతో ఉండగా సిజేరియన్‌ చేసి బిడ్డను తీశారు

ఆక్సిజన్‌ ఇవ్వకుండా పురిట్లోనే బిడ్డను చంపేశారు

40 రోజులుగా న్యాయం కోసం బాలిక పోరాటం

పోలీసుల చుట్టూ తిరుగుతోన్న బాధిత బాలిక

స్పందనలోనూ ఫిర్యాదు. ఏ మాత్రం స్పందించని కలెక్టర్‌

ప్రెస్‌మీట్‌లో మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఆక్షేపణ

రాజమహేంద్రవరం:సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశం సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు వంటిదని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ స్పష్టం చేశారు. వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారన్న ఆయన, నిరసన పేరుతో టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారని చెప్పారు. జర్నలిస్ట్‌ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఒక సాకు మాత్రమే అని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సాక్షి గొంతు నొక్కడమే వారి లక్ష్యమని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ మార్గాని భరత్‌ తెలిపారు.
ప్రెస్‌మీట్‌టో మార్గాని భరత్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

నిరసన ముసుగులో..:
    టీవీ డిబేట్‌లో జర్నలిస్ట్‌ కృష్ణంరాజు వ్యాఖ్యలను సాకుగా చూపించి సాక్షి కార్యాలయాల మీద దాడులకు టీడీపీ వ్యూహాత్మకంగా పార్టీ నాయకులను ప్రేరేపించింది. పార్టీ మహిళలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాక్షి కార్యాలయాల మీద దాడులకు తెగబడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంటే తట్టుకోలేక సాక్షి గొంతు నొక్కాలని పార్టీ ఎమ్మెల్యేలను, వారి కుటుంబ సభ్యులను దాడులకు ఉసిగొల్పింది. 
    అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే, రాజానగరం జనసేన ఎమ్మెల్యేలు స్వయంగా సాక్షి కార్యాలయాల మీద దాడుల్లో పాల్గొన్నారు. విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ భార్య, ఆయన కుమారుడు దాడుల్లో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు ఏలూరులో సాక్షి ఆఫీసుకి నిప్పంటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల ముసుగులో రౌడీ మూకను రంగంలోకి దించి సాక్షి కార్యాలయాల పేరును పీకేయడం, గేట్లను బద్దలు కొట్టడంలాంటి విధ్వంసక చర్యలకు దిగారు. ఇదేనా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం? ఏలూరులో సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటనలో పోలీసులు కూడా అక్కడే ఉండి చోద్యం చూస్తుండిపోయారు. 

వారిపై చర్యలు ఎందుకు లేవు?:
    సాక్షి టీవీ డిబేట్‌లో రాజధాని మహిళలపై నిందలు మోపారంటూ, అసత్య ఆరోపణలు చేసి, దానిపై నానా రాద్దాంతం చేసి అనలిస్ట్‌తో కృష్ణంరాజుతో పాటు, డిబేట్‌ ప్రజెంటర్‌ అయిన సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేశారు. మరి అదే ఎల్లో మీడియా ఛానల్‌లో జగన్‌గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన హేయంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేఱుకాచౌదరిపైన, ఆ ప్రజెంటర్‌పై ఎందుకు చర్య తీసుకోలేదు? ఆ ఇద్దరినీ ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు? అలాగే ఆ ఛానల్‌పై కూడా చర్య తీసుకోవాలి కదా? మరి ఇప్పటి వరకు ఆ పని ఎందుకు చేయడం లేదు?.

తల్లికి వందనం పేరుతో మోసం:
    సూపర్‌ సిక్స్‌ పథకాలన్నీ అమలు చేశామరి, ఎవరైనా అడిగితే వారి నాలిక మందం ఎక్కినట్లు అని సీఎం చంద్రబాబు అనడం సిగ్గుచేటు. పథకంలో దాదాపు 30 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు. తల్లికి వందనం కింద రూ.13,100 కోట్లు కేటాయించాల్సి ఉంటే కేవలం రూ.8,740 కోట్లు మాత్రమే ఇచ్చారు. గత ఏడాది పథకాన్ని అమలు చేయకుండా తల్లీ, బిడ్డలను మోసగించారు.
    మరోవైపు నాడు సీఎం శ్రీ వైయస్‌ జగన్, స్కూళ్ల నిర్వహణ కోసం అమ్మ ఒడి నుంచి రూ.2 వేలు తీసుకుంటే, దారుణ విమర్శలు చేసిన మంత్రి నారా లోకేష్, ఇప్పుడు తాను అదే పని చేశారు. అందుకే రూ.15 వేలకు బదులు రూ.13 వేల చొప్పున మాత్రమే ఇచ్చారు. మరి దీనికి మంత్రి లోకేష్‌ ఏం సమాధానం చెబుతారు? అప్పటి తన విమర్శలకు ఏం సమాధానం చెబుతారు?.
    ఇంకా సూపర్‌సిక్స్‌లో భాగమైన నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధి పథకాల అమలు ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. కానీ, సూపర్‌సిక్స్‌ పథకాలన్నీ అమలు చేశామని నిస్సిగ్గుగా చెబుతోంది.

ఎమ్మెల్యే అనుచరుడి ఘాతుకం:
    రాజమండ్రి ఎమ్మెల్యే అనుచరుడు సత్యదేవ్‌ అనే వ్యక్తి, ఎస్సీ మైనర్‌ బాలికను మాయ మాటలతో లోబర్చుకుని గర్భవతిని చేశాడు. 2024 డిసెంబర్‌లో ధవళేశ్వరంలోని ఒక ఆస్పత్రిలో ఆ బాలికకు 8వ నెలలో సిజేరియన్‌ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్‌ తర్వాత బిడ్డ ఆరోగ్యంగా బతికే ఉంది. ఆక్సిజన్‌ ఇవ్వకుండా చంపేశారు. బతికున్న శిశువును చంపే హక్కు ఎవరిచ్చారు? చట్ట పరంగా ఇది పెద్ద నేరం. తనకు న్యాయం చేయాలని బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ 40 రోజులుగా ఆ బాలిక, బాలిక కుటుంబం తిరుగుతున్నా కేసు నమోదు చేయలేదు. అక్కడ న్యాయం జరగడం లేదని స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని పిలిపించి పెళ్లి చేసుకోవాలని అతడికి వారం టైమిచ్చారు. కానీ ఏ స్పందనా లేకపోవడంతో న్యాయం చేయమని కోరుతూ ఆ కుటుంబం నా వద్దకు వచ్చింది. సామాన్యులకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదని చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం.
    ఒక మైనర్‌ బాలికకు ఇంత అన్యాయం జరిగితే, ఆ పని చేసింది తన అనుచరుడు కావడంతో, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఏమీ ఎరుగనట్టు వదిలేశాడు. ఇదే సత్యదేవ్‌ విషయంలో ఇలాంటి ఘటనే ఇంతకముందు కూడా ఒకటి జరిగిందని ఆయన అనుచరులే చెబుతున్నారు. మరోవైపు ఇటీవలే ఒక నర్సింగ్‌ విద్యార్థిని కూడా ఇక్కడ టీడీపీ నాయకుడి మోసానికి బలై చనిపోయింది. రాజమహేంద్రవరంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా, ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నా పట్టించుకోకపోవడం దారుణమని మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఆక్షేపించారు.

Back to Top