నేడు అనంతపురం, అరకులో సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్‌

అమరావతి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. నేడు అనంతపురం, అరకు నియోజకవర్గాలలో జరగనుంది. అనంతపురంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగునుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అనంతపురం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అంబేద్కర్ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకు బస్సు యాత్ర సాగనుంది.  అనంతరం సాయంత్రం 4 గంటలకు చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరుకానున్నారు.

అల్లూరి జిల్లా..
అల్లూరి జిల్లా అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గొన ఆధ్వర్యంలో హుకుంపేటలో బస్సుయాత్ర జరగనుంది. ఉదయం 11 గంటలకు బర్మన్ గూడలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బర్మన్ గూడా నుంచి హుకుంపేట వరకు భారీ బైక్ ర్యాలీ సాగనుంది. అనంతరం హుకుంపేట కస్తూరిబా పాఠశాలలో నాడు- నేడు పనులను మంత్రులు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హుకుంపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు రాజన్న దొర, మేరుగు నాగార్జున, ఇంచార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, సీదిరి అప్పలరాజు తదితరులు హాజరుకానున్నారు. 

Back to Top