నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సామాజిక సాధికార యాత్ర

 తాడేపల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార యాత్ర రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని ఆత్మీయంగా పలకరించేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చేపట్టిన యాత్ర నేడు ఎమ్మిగనూరు, మండపేటలో సాగనుంది.

కర్నూలు జిల్లా:
ఎమ్మినూరులో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగనుంది. మండల పరిషత్ కార్యాలయంలో 3.30 గంటలకు ముఖ్య నేతలతో ముఖాముఖి అనంతరం.. 4.30కుఎద్దుల మార్కెట్  నుండి సోమప్ప సర్కిల్ మీదుగా వైయ‌స్ఆర్   సర్కిల్‌కు వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బస్టాండ్ ఎదుట బహిరంగ సభ జరగనుంది. మంత్రులు అంజాద్ బాష, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, మా జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , ఎంపీ. సంజీవ్ కుమార్, తదితరులు హాజరుకానున్నారు.

కోనసీమ జిల్లా
మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తాపేశ్వరంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీడియా సమావేశం అనంతరం మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువ పువ్వు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కలువు పువ్వు సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రి జోగి రమేష్, ఎంపీలు పిల్లి సుభాస్ చంద్రబోస్, మార్గాని భరత్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, తదితరులు హాజరుకానున్నారు. 

తాజా వీడియోలు

Back to Top