సామాజిక న్యాయంతో సీఎం వైయ‌స్ జగన్‌ చరిత్ర తిరగరాశారు

వైయ‌స్ఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేష్‌ బాబు

రాజంపేట‌లో సామాజిక సాధికార బ‌స్సు యాత్ర‌

అన్నమయ్య: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలును వివరించడానికి వైయ‌స్ఆర్‌షీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. మంగళవారం అన్నమయ్య జిల్లాలో రాజంపేట నియో­జకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరుగుతోంది. రాజంపేట బహిరంగ సభలో వైయ‌స్ఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేష్‌ బాబు మాట్లాడారు.

ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చేశామని, కానీ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం సామాజిక సాధికారత సాధించి చరిత్ర తిరగరాశారని అన్నారు. సీఎం జగన్‌ ఎంతో మంది సామాన్యులకు పదవులిచ్చారని తెలిపారు. బీసీలను రాజ్యసభకు పంపిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. మళ్లీ కొందరు అబద్దపు హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. వైయ‌స్ జగన్‌ను అశీర్వదించండని కోరారు.

తాజా వీడియోలు

Back to Top