దుష్టశక్తుల ట్రాప్‌లో షర్మిల  

వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ మిథున్‌రెడ్డి 

ప‌శ్చిమ‌గోదావ‌రి:  షర్మిల దుష్టశక్తుల ట్రాప్‌లో ఉన్నారని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ష‌ర్మిల‌ను చూస్తే జాలివేస్తోందని, చంద్రబాబు డైరెక్షన్‌లో ఆమె నడుస్తున్నారన్నారు. ఈనెల 30న ఏలూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల సన్నాహక సభకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి హాజరవుతారని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఏలూరులోని  పార్టీ కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా నేతలతో మిథున్‌రెడ్డి సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ఏలూరులో జరిగే సభకు ఉమ్మడి పశ్చిమ ,తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. కార్యకర్తలకు, నాయకులకు సీఎం వైయ‌స్ జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారని వెల్లడించారు.  

Back to Top