అమరావతి: అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న వైయస్ఆర్‌సీపీ నేతలు, రైతులు కదం తొక్కుతున్నారు. అన్ని జిల్లాల్లో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. రైతులకు అండగా తరలి వచ్చిన వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల రైతులు, వైయస్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పలు చోట్ల ముందుస్తుగానే వైయస్ఆర్‌సీపీ నేతల హౌస్ అరెస్ట్, అరెస్ట్‌లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. అన్నదాతకు అండగా వైయస్ఆర్‌సీపీ నిరసనపై పోలీసులు ఉక్కుపాదం పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గ, పార్టీ నేతలు ఆసిఫ్, కార్పొరేటర్లు అరెస్ట్ రైతు ధర్నాకు వెళ్లకుండా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ హౌస్ అరెస్ట్ నిరసనలో పాల్గొనకుండా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు హౌస్ అరెస్ట్ తిరుపతి కలెక్టరేట్ వద్దకు చేరుకున్న రైతులు.. తిరుపతి జిల్లా.. అన్నదాతకు అండగా కూటమి సర్కార్‌పై నిరసన గళం వినిపించేందుకు తరలి వచ్చినవైయస్ఆర్‌సీపీ శ్రేణులు తిరుపతి కలెక్టరేట్ వద్దకు జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు రాష్ట్రవ్యాప్తంగా పిలుపులో భాగంగా భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఏలూరులో మొదలైన రైతుల ర్యాలీ పశ్చిమ గోదావరి: ఏలూరులో ఫైర్ స్టేషన్ వద్ద దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి ర్యాలీ ప్రారంభించారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి ఖమ్మం విజయరాజు , ఏలూరు జిల్లా ఇన్‌చార్జ్ డీఎన్ఆర్ ఆధ్వర్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరారు.