వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు

పార్టీ జెండా ఆవిష్క‌రించిన ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు 

హైదరాబాద్‌:వైయస్‌ఆర్‌ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు కేక్‌ కట్‌ చేశారు.ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, జంగా కృష్ణమూర్తి,లక్ష్మీ పార్వతి, ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.పార్లమెంటు జిల్లా కేంద్రాలతో పాటు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో,మండల కేంద్రాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ,సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2011 మార్చి 12న ప్రారంభమైన నాటి నుంచి ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోసింది. రైతుల కోసం,శ్రామికుల కోసం,మహిళల కోసం, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం, సాగునీటి కోసం,ప్రాజెక్టుల కోసం,రాష్ట్రం కోసం,రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం వైయస్‌ఆర్‌సీపీ పోరాడుతుంది.

వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ‘విజయవంతంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 9వ వసంతంలోకి అడుగుపెట్టింది. జనహృదయ నేత రాజన్న సిద్ధాంతాలను కొనసాగించాలనే ధ్యేయంతోనే యువజన శ్రామిక రైతు పార్టీ అనే పేరు పెట్టాలని నిర్ణయించారు. 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యాం. అయినా, అది ఓటమిగా భావించడం లేదు. ఈ ఐదేళ్ల టీడీపీ నిరంకుశ పాలనలో ఎన్నో అక్రమాలు చోటు జరిగాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి లాగే శర్మిలమ్మ పాదయాత్ర చేశారు. వైఎస్‌ జగన్‌ కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచారు. 14 నెలల సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టి 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఎన్నో గొప్ప ఆశయాలు గల మన పార్టీ తొమ్మిదో వసంతంలోకి అడుగుపెడుతున్నందుకు జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు. వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులు పోయి మంచి రోజులు వస్తాయి. ఆయనకు ఓసారి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు.

Back to Top