వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. విశాఖ ఉక్కు, కృష్ణా జలాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా అనుసరించాల్సిన విధానంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top